తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కి 73 సంవత్సరాలు సందర్భంగా 73 కేజీల కేకు, మహిళలకు చీరలు, స్వీట్స్ రాష్ట్ర బీసీ సెల్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో 73 కేజీల కేకును కట్ చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వర్ల రామయ్య , టి డి జనార్ధన్ , పీతల సుజాత , పరుచూరి అశోక్ బాబు , ఏఎస్ రామకృష్ణ , జలీల్ ఖాన్ ,కొమ్మారెడ్డి పట్టాభిరామ్ , వీరంకి గురుమూర్తి, టిఎన్టియుసి రఘురామరాజు, కూచిపూడి విజయ, మనవ మోహన్ కృష్ణ, డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యరావు , పాతర్ల రమేష్ ,సయ్యద్ రఫీ, దేవతోటి నాగరాజు, కిలారి శ్రావణ్, బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, ములక సత్యవాణి, సంధిరెడ్డి గాయత్రి , కనకచారి, పరుచూరి ప్రసాద్, రవిపాటి సాయికృష్ణ, బండారు వంశి, ఎస్పీ సాహెబ్, టి డి ఎల్ పి సురేష్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ అఖిల్, కిరణ్ వల్లూరిచిన్ని, విజయ్ బాబు, కొమ్మినేని సాంబశివరావు, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply