Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధికి చిరునామా చంద్రబాబు పాలన

– ఆటోనగర్ శంఖుస్థాపనతో బుచ్చి పట్టణ అభివృద్ధికి శ్రీకారం
– స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.
– ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధిస్తా
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

కోవూరు: ఆటో నగర్ శంకుస్థాపన ద్వారా బుచ్చిరెడ్డి పాళెం ప్రాంత అభివృద్ధికి అంకురార్పణ మొదలైందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చి పట్టణ శివార్లలోని నాగమాంబాపురం వద్ద ఆమె ఆటోనగర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బుచ్చి మెకానిక్ అసోసియేషన్ కు చెందిన ఆటో టెక్నీషియన్స్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి మేళతాళాల మధ్య పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుచ్చిరెడ్డిపాళెం మెకానిక్ సోదరుల చిరకాల స్వప్నమైన ఆటోనగర్ భూమిపూజ కార్యక్రమం ఎమ్మెల్యే హోదాలో తన చేతుల మీదుగా జరగడంచాలా సంతోషంగా వుందన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. కనీస వసతులు లేక రోడ్ల పక్కన మెకానిక్ షెడ్లు నిర్వహించుకుంటున్న దాదాపు 150 మంది మెకానిక్స్, వెల్డర్స్ తదితర టెక్నీషియన్స్ కు ఈ ఆటోనగర్ లో శాశ్వత వర్క్ షాపులు రాబోతున్నాయన్నారు.

APIIC ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఆటోనగర్ భవిషత్తులో నాగమాంబ పురం స్థానికులకు ఉపాధి కేంద్రంగా మారబోతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించే ట్రాక్టర్లు రిపేర్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ లాంటి అవసరాలకు కోసం ఇటు బుచ్చి అటు కొడవలూరు మండల రైతాంగానికి ఈ ఆటోనగర్ చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు.

ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆటోనగర్ కోసం కేటాయించిన ఈ భూమిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించే ట్రాక్టర్లు రిపేర్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ లాంటి అవసరాలకు కోసం ఇటు బుచ్చి అటు కొడవలూరు మండల రైతాంగానికి ఈ ఆటోనగర్ చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. దశాబ్ద కాలంగా పరిష్కారం కాని కోవూరు షుగర్ ఫ్యాక్టరి రైతులు మరియు కార్మికుల సమస్యను పది నెలల వ్యవధిలో పరిష్కారం చూపేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు.

APIIC ద్వారా రోడ్లు, విద్యుత్తు, మరియు తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించి రానున్న 2 నెలల్లో ఆటోనగర్ నిర్మాణం పూర్తి చేసి తానే ప్రారంభోత్సవం చేస్తానన్నారు. ఎన్నో సంవత్సరాల ఆటోనగర్ కల సాకారం అయిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం మెకానిక్ సోదరులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, బుచ్చి నగర పంచాయతి కౌన్సిలర్లు టిడిపి నాయకులు ఎంవి శేషయ్య, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మన్ పుట్టాసుబ్రమణ్యం నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE