జగన్ రాకపోతే చంద్రబాబు విలువ తెలిసేది కాదు

– యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం

తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు.

తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ… చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు చదువుకున్న పేదపిల్లలకు ఉద్యోగాలు లభించాయి, తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. అన్నక్యాంటీన్ ద్వారా పేదలకు 5రూపాయలకే భోజనం పెట్టి ఆకలితీర్చారు. గతంలో అమలైన మంచిపనులు కొనసాగించి ఉంటే నేడు రాష్ట్రంలో పరిస్థితులు ఇంతదయనీయంగా ఉండేవి కాదని అభిప్రాయపడ్డారు.

మరో వక్త మాట్లాడుతూ… జగన్ వద్ద మజిల్ పవర్ తప్ప మైండ్ పవర్ లేదు, వాలంటీర్లు, డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చాక మేకిన్ ఇండియా మాదిరి మేకిన్ ఆంధ్రా నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

Leave a Reply