చంద్ర‌న్న సంక్షేమ ముద్ర‌లు చెర‌ప‌లేవు జ‌గ‌న్‌

– నారా లోకేష్‌

చంద్ర‌న్న ముఖ్య‌మంత్రిగా చేసిన సంక్షేమాన్ని చెరిపేయలేవు, సాధించిన ప్ర‌గ‌తిని ధ్వంసం చేయ‌లేవు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప‌థ‌కాలు ర‌ద్దు చేయ‌గ‌ల‌వు కానీ వాటి ఫ‌లాలు ర‌ద్దు చేయ‌లేవు. కానుక‌లు ఆపేస్తావు, వాటి గుర్తులు చెరిపేయ‌లేవు. నిర్మాణాల‌ను ధ్వంసం చేస్తావు,సాధించిన ప్ర‌గ‌తిని ఏం చేయ‌లేవు. దీనికి నిద‌ర్శ‌న‌మే ఈ అవ్వ చేతిలో చంద్ర‌న్న అందించిన సంక్రాంతి కానుక సంచి. పీలేరు నియోజ‌క‌వ‌ర్గం వాయ‌ల్పాడు మార్కెట్ మీదుగా న‌డిచి వెళ్తున్న‌ప్పుడు మార్కెట్లో స‌రుకులు కొనుక్కుని వెళ్తున్న అవ్వ క‌న‌ప‌డింది.

టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో సంక్రాంతి సంద‌ర్భంగా చంద్ర‌న్న ఇచ్చిన కానుక‌ల సంచి అని అవ్వ చెప్పింది. చంద్ర‌న్న సంక్షేమం ముద్ర ఎంత‌గా చెరిపేయాల‌న్నా చెరిగిపోదు జ‌గ‌న్‌! ఆ ప‌థ‌కాలు ఆపేయ‌డం, కానుక‌లు ర‌ద్దు చేయ‌డం, రంగులు వేసుకుని పైశాచిక ఆనందం పొంద‌డం అవ‌స‌ర‌మా జ‌గ‌న్ రెడ్డి?

Leave a Reply