* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* 30 ఏళ్ల చంద్రబాబు పాలనలోనే అభివృద్ధి
* అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్దపీట
* మహిళలు, రైతులు, యువతకు పెద్దన్నగా భరోసా
* సస్య శ్యామలంగా రాయలసీమ
* ఒకటో తారీఖొస్తే రాష్ట్రంలో పెన్షన్ల పండగ
* సీఎంగా చంద్రబాబు 30 ఏళ్ల పూర్తి చేసుకోవడంపై మంత్రి సవిత హర్షం
* సోమందేపల్లిలోని బ్రాహ్మణపల్లిలో సంబరాలు
* కేక్ కట్ చేసి… చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
* బ్రాహ్మణపల్లిలో ఇంటింటికీ వెళ్లి మంత్రి సవిత పెన్షన్ల పంపిణీ
పెనుకొండ/శ్రీసత్యసాయి : సీఎం చంద్రబాబునాయుడి నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆయన పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడి పాలనతోనే తెలుగోడి తలరాత మారిందన్నారు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబునాయుడు తొలిసారిగా బాధ్యతలు చేపట్టారన్నారు. 45 ఏళ్ల వయస్సులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అభివృద్ధి పథంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని నడిపించారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారన్నారు.
డ్వాక్రా సంఘాలను ప్రారంభించి, మహిళలను ఆర్థికంగా అభివృద్ది పరిచారన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. వృద్ధ, వితంతు, దివ్యాంగుల పెన్షన్లతో పాటు ఒంటరి మహిళ పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. డీఎస్సీ ద్వారా లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు.
ఒకటో తారీఖొస్తే పండగే…
ప్రతి నెలా ఒకటో తారీఖొస్తే రాష్ట్రంలో పెన్షన్ల పండగేనని మంత్రి సవిత తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సెప్టెంబర్ నెలకు రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి రూ.2,746.52 కోట్లు అందజేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వృద్ధ్యాపు, వితంతు, ఒంటరి మహిళలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచామన్నారు.
వైసీపీవి ఫేక్ ప్రచారాలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక… వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలకు తెరతీశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఇటీవల అనంతపురంలో చేయి ఉన్నా, వికలాంగుడిని అంటూ వైసీపీ కార్యకర్త ఫేక్ వీడియో ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్నినిలబెట్టుకునేలా పాలన సాగిస్తోందన్నారు. కుప్పంతో పాటు పులివెందులకు కూడా నీరిచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు.
బ్రాహ్మణపల్లిలో పెన్షన్ల పంపిణీ
సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు స్వయంగా మంత్రి సవిత పెన్షన్లు అందజేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గత నెలలో నోటీసులు అందజేసిన దివ్యాంగులందరికీ పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.