– సంతకాలు పెట్టాలని ఒత్తిడిచేశారు
– చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
లిక్కర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ తరవాత ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పినట్టు తెలిపారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా బలవంతంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్లు చెప్పినట్టు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తానని మండిపడ్డారు.
వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుండి వేల కోట్లు దోచేశారనే ఆరోపణలు ఉండగా.. అందులో కొంతడబ్బును వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసిందని సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉందని పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు జులై 1 వరకు రిమాండ్ విధించింది.