డా.బి.ఆర్ అంబేద్కర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని గౌరవం

-ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది
-బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలోనే కేసిఆర్ తెలంగాణలో జనరంజక పాలన అందిస్తున్నారు
-అంబేద్కర్ ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ
-ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి
-ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం
-నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు..సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు పరిశీలించారు. ఆర్కిటెక్ట్ts2 ప్రదర్శించిన వీడియో తిలకించి నిర్మాణంలో స్వల్ప మార్పులు సూచించారు. నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు 3గంటల పాటు కలియతిరిగారు. సివిల్ వర్క్స్,మెయిన్ ఎంట్రన్స్ లో పార్లమెంట్ ఆకృతి వచ్చే పిల్లర్స్ రెడ్ సాండ్ స్టోన్ క్లాడింగ్ పనులు,ప్రధాన ద్వారంలో ఉండే ఆడిటోరియం,ఆర్ట్ గ్యాలరీ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు,వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. అనంతరం మొదటి అంతస్థులో విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎనలేని గౌరవమని మంత్రి తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలోనే కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి నెలలో 125 అడుగులts అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ కింది భాగం పార్లమెంట్ భవన ఆకృతి వచ్చేలా నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారని,వారు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాన్ని మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గత ఏడాది కాలంగా ఈ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కేసిఆర్ సూచనల మేరకు..విగ్రహం కింది భాగంలో అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం,ఆయన రాజ్యాంగ నిర్మాణం కోసం,దేశ ప్రజల కోసం చేసిన సేవలకు సంబంధించిన ఫొటో గ్యాలరీతో పాటు ఆయన గొప్పతనం,జీవిత చరిత్ర ను తెలిపే ఆడిటోరియం,థియేటర్ ఉంటుందన్నారు. అందులో ప్రస్తుత యువతకు స్ఫూర్తి నింపే విధంగా అంబేద్కర్ పార్లమెంట్ లో మాట్లాడిన ప్రత్యక్ష వీడియో స్పీచ్ లు, ఆయన జీవిత చరిత్ర మీద వచ్చిన సినిమాలోని ముఖ్య వీడియోలు ప్రదర్శించబడతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ కట్టడం నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయన్నారు.సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తమకు సలహాలు సూచనలు చేస్తున్నారని,ఫిబ్రవరి మాసం లో పూర్తి చేస్తామన్నారు.ఏప్రిల్ లో అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా ఇక్కడ ప్రారంభం చేసుకుంటామని తెలిపారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు కొన్ని సూచనలు సలహాలు చేశారన్నారు. మంత్రుల వెంట ఆర్ అండ్ బి అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు పలువురు ఉన్నారు.