-ఎమ్మెల్యే యార్లగడ్డ
గన్నవరం : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకర్గం కేసరపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనేని పార్వతి అనే మహిళా క్యాన్సర్ తో బాధపడుతూ హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది . ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయగా యార్లగడ్డ సిఫార్సు మేరకు చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల LOC మంజూరు చేశారు.
మంజూరైన LOC ని బుధవారం గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తన కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.