గురుదేవ చారిటబుల్ ట్రస్టును సందర్శించిన చిన్నజీయర్ స్వామి

-రూ.10లక్షలు విరాళం

జీవితంలో గురువును, దైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని చిన్నజీయర్ స్వామి తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టును సందర్శించిన జీయర్ స్వామి ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామంలోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టును చిన్న జీయర్ స్వామి సందర్శించారు. ట్రస్టు ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గురువును, దైవాన్ని మర్చిపోకూడదని సూచించారు. వారిరువురిని గుర్తుంచుకుంటే సుఖ సంతోషాలతో జీవితం నడుస్తుందని బోధించారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబును, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను జీయర్ స్వామి కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి అధునాతన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ట్రస్టుకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి 10 లక్షల విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హాస్య అవధాని శంకర్ నారాయణ, ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు, ఇతర పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై జీయర్ స్వామిని దర్శించుకున్నారు.