తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, విజిఓ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈఓ కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.