విజయవాడ: బుడమేరు వరద కారణంగా విజయవాడ నగరంలో బురద మయంగా మారిన వివిధ రహదారులను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 43 అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ టెండర్లను విజయవాడ నగరానికి తీసుకు వచ్చి పెద్ద ఎత్తున క్లినింగ్ చర్యలు చేపట్టారు.
అదే విధంగా వరదలతో ఇళ్ళలో పేరుకుపోయిన బురదను తొలగించి ఇళ్ళ పరిసరాలను శుభ్రం చేసుకునేందు ఈఫైర్ టెండర్లను వినియోగించుకో వచ్చును. వివిధ ఫైర్ టెండర్లను వార్డుల వారీగా పంపి పలు రహదారులపై పేరుకుపోయిన చెత్తా చెదారాలను, బురదను నీటితో శుభ్రం చేయడం జరుగుతోంది.