Suryaa.co.in

Andhra Pradesh

సీఎంఆర్‌ఎఫ్‌కు విజయనగరం జిల్లా సమాఖ్య 10 లక్షల విరాళం

విజయవాడ: బుడమేరు వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధుల సాధికారిక మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.

ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం విజయనగరం జిల్లా సమాఖ్య నాయకులు 10 లక్షల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య కార్యదర్శి కె వెంకట సత్యవతి, గంట్యాడ మండల సమాఖ్య అధ్యక్షురాలు పి జనని, జిల్లా సమాఖ్య మేనేజర్ పి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE