– వారిలో అభద్రతాభావం తొలగించండి
– రోడ్లకు నిధులిచ్చేందుకు వెనుకాడవద్దు
– ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్యాపిటల్ వర్క్స్ మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
– ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్యాపిటల్ వర్క్స్ పై మంత్రుల కమిటీ సమావేశం.
– హాజరైన డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,సీతక్క
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి కామెంట్స్:
ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నది పనుల పురోగతి కోసం. రాష్ట్ర ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు నిత్యం ప్రజలకు కనెక్ట్ అయి ఉండే శాఖలు. రాష్ట్ర రాజధాని నుండి జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలకు మంచి రోడ్ల కనెక్టివిటీ ఉంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇండస్ట్రీస్ వెళ్తాయి. దీంతో రూరల్ లోనే ఉద్యోగ, ఉపాధి కల్పన ఏర్పడుతుంది.
ఉద్యోగం,ఉపాధి హైదరాబాద్ లోనే కాదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా దొరుకుతుందనే భావన సృష్టించాలి. అందుకు ప్రజలకు మొదటి ప్రాధాన్యతగా మంచి రోడ్లు ఉండాలి. మంచి రోడ్లు ఉంటే ప్రజా రవాణా, ప్రభుత్వం పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లాలన్న రోడ్ స్పీడ్ ను పోల్చి చూస్తారు.
రోడ్ల కోసం నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఎక్కడా వెనుకాడొద్దు. అనేది ఫైనాన్స్ మినిస్టర్ భట్టి ,సహచర మంత్రులకు నా సూచన. హ్యామ్ విధానంలో చేపట్టాల్సిన రోడ్లను స్పీడప్ చేయాలి. 3 ఏళ్లలో యాక్సిడెంట్స్ కు ఆస్కారం లేని మంచి రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. కాంట్రాక్టర్ల పేమెంట్ విషయంలో వారికున్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత మనపై ఉంది.గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాలు ప్రస్తుతం మనకు ఇబ్బందిగా మారాయి.