Suryaa.co.in

Telangana

సీతాఫలమండి ప్రభుత్వ కాలేజీ భవనాల నిధులకు సీఎం ఆమోదం

– కేసీఆర్ తో చర్చించిన ఉప సభాపతి పద్మారావు
– బోనాలు వేడుకలకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన పద్మారావు

సికింద్రాబాద్ : తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మారావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, తెరాస యువ నేతలు తీగుళ్ల కిషోర్ గౌడ్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లతో పాటు ఇతర నాయకులతో కలిసి అయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు.

సీతాఫలమండిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలనీ పద్మారావు , సీఎంను కోరారు. 20 15 సంవత్సరంలో తన విజ్ఞప్తి మేరకు సీతాఫలమండి ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలోనే జూనియర్, డిగ్రీ కాలేజిలు ఏర్పాటు చేసేందుకు సీ ఎం ఆమోదాన్ని తెలిపిన విషయాన్నీcm-kcr ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి నుంచి స్కూల్ ప్రాంగణంలో జూనియర్, డిగ్రీ కాలేజీలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. హై స్కూల్ భవనాలకు 14.45 కోట్ల రూపాయలు, జూనియర్ కాలేజి భవనాలకు రూ.6.30 కోట్లు, డిగ్రీ కాలేజికు రూ.9 కోట్ల ఖర్చుతో అంచనాలు రూపొందాయని పద్మారావు ఈ సందర్భంగా వివరించారు.

ఈ నెల 17 వ తేది ఆదివారం నాడు లష్కర్ బోనాలు వేడుకల్లో పాల్గొనాలని, తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని పద్మారావు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోనాలు వేడుకల్లో పాల్గొన్న అనంతరం సికింద్రాబాద్ లో పద్మారావు ఇంటికి విందుకు హాజరు కావడం కెసిఆర్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ను పద్మారావు కలిసి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE