Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

-కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు

టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు:-

• కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉంది
• 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నా.
• కూటమి విజయం సాధారణమైంది కాదు…గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు
• కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో… 57 శాతం ఓట్ షేర్ ను సాధించింది
• 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం వెనక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, ఐదేళ్లు పడ్డ కష్టం ఉంది
• గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీలు వచ్చాయి. పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైన మెజారిటీ వచ్చింది. కార్యకర్తలు, నేతలు పోటీ పడి పని చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి.
• విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, గుంటూరు ఎంపీ స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది
• గత ఐదేళ్లు మీరు పడ్డ కష్టాలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర మర్చిపోలేనిది.
• పసుపు జండా పట్టుకుంటే చెయ్యి విరగొట్టారు…జై తెలుగుదేశం అంటే గొంతు కోశారు..అయినా కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి పార్టీ కోసం పని చేశారు.
• కొందరు ప్రాణాలు కోల్పోయారు…కొందరు ఆస్తులు కోల్పోయారు… ఇంకొందరు జైలు పాలయ్యారు.
• కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపాను. మీ త్యాగం నా జీవితంలో మర్చిపోలేను
• కింద స్థాయి నుంచి ఎవరు…ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేస్తున్నాం
• నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయి. ఎలా చేయాలి…వారికి ఏం చేయాలి అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నాం
• అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయవద్దు
• ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలను విస్మరించ కూడదు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చేయొద్దు.
• ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్ వేవ్ లేదు. కూటమి విజయానికి సహకరించిన ప్రజలను మనం ఆదుకోవాలి.
• ఎన్నికల ముందు సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించాం..ఇచ్చిన హామీలను తప్పుకుండా అమలు చేస్తాం.
• ఇటీవల మెగాడీఎస్సీ ఫైలుపై సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం.
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై ఐదో సంతకం చేశాం.
• యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది.
• 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో…. వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తాం
• 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలి…అందులో తెలుగువారు నెంబర్ -1 గా ఉండాలి అనేది నా ఆకాంక్ష. దాని కోసం కష్టపడతాను.
• పార్టీ కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యత ఉండేలా నేతలు నడుచుకోవాలి. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తాం.
• నేను తరుచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతాను. జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతాను.
• నేతలు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి.
• కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తాం.
• కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి ఇబ్బందులు పరిష్కరిస్తేనే వారిలో మనోబలం పెరుగుతుంది.
• గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించాం…ఇక ముందు కూడా ఆదుకుంటాం.
• ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టాం. పాజిటివ్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నాం.
• పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని బీజేపీ కూడా ముందుకు వచ్చింది.
• మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు.
• నాయకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ. పాలన ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా, ఆదర్శంగా పాలన సాగిద్దాం.
• 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కృషి చేయాలి. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లో వస్తాయి. అహంకారానికి దూరంగా, బాధ్యతగా, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు.
• ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో చర్చ విస్తృతంగా జరగాలి. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పని చేయాలి.
• అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తాం. ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోను. ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా.
• టెలీకాన్ఫరెన్స్ పాల్లొన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు.

LEAVE A RESPONSE