Suryaa.co.in

Andhra Pradesh

నరసరావుపేటపై జగన్ వరాల జల్లు

– ఫ్లై ఓవర్, ఆటో నగర్, వెటర్నరీ కాలేజ్ మంజూరు

పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేట అవతరించిన తరువాత నరసరావుపేటకి విచ్చేసిన సీఎంకి పలనాడు వాసులు ఘనస్వాగతం పలికారు. ముందుగా దివంగత సర్ధార్ వెంగాళ రెడ్డి విగ్రహాన్ని సీఎం చేతుల మీదగా మంత్రులు, శాసనసభ్యులు ఆవిష్కరించి.. సభాస్థలికి బయలుదేరిన సీఎంకి థాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లేకార్డులు పట్టుకొని పట్టణ వాసులు నీరాజనాలు పలికారు.

సభాస్థలి చేరుకున్న అనంతరం స్టాల్స్ను సందర్శించి వాలంటీర్లతో ఫోటోలు దిగారు. అనంతరం శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వాలంటీర్లు అంటే సంచులు మోసే వారని చంద్రబాబు తక్కువ చేసి మాట్లాడారనీ అన్నారు. వాలంటీర్లు అంటే సంచులు మోసే వారు కాదని.. ప్రాణాలు నిలబెట్టే వారని అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించారని అన్నారు.

దేశంలో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్లు వ్యవస్థ తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు అన్నారు. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదని.. బుల్లెట్ దిగిందా లేదా అని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన ఘనత సీఎం జగన్ గారిది అన్నారు. ఎంత కాలం బతికమన్నది ముఖ్యం కాదని.. ఎలా బతికమో ముఖ్యం అని వైఎస్సార్ గారిని గుర్తు చేసుకున్నారు. జిల్లాగా ఎర్పాటు చేసిన సీఎం గారికి పల్నాడు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. నాయకుడు అనే వారికి సంకల్పం, పట్టుదల, చేయాలని తత్వం ముఖ్యం అన్నారు.

నరసరావుపేట ప్రాంతానికి ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున ఫ్లై ఓవర్.. నరసరావుపేట పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు, వెటర్నరీ కాలేజ్ కోసం విజ్ఞప్తి చేయగా సీఎం మంజూరు చేస్తూ.. హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE