– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
సీఎం జగన్ కి అంబేద్కర్ ఆశయాలన్నా, రాజ్యాంగమన్నా చిత్తశుద్ది, గౌరవం ఏ కోశాన లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు.. .
రాజకీయ లబ్ది కోసమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
రూ.404 కోట్ల ఖర్చుతో విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టింది రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం తప్ప అంబేద్కర్ పట్ల చిత్తశుద్దితో కాదు. చంద్రబాబు పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్య కు అంబేద్కర్ పేరు తొలగించి, జగన్ పేరు పెట్టినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మనసు గాయపడింది. 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్న పాపం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ స్ధాపనతో పోతుందా జగన్ రెడ్డి?
డాక్టర్ సుధాకర్ తో సహా ఎంతోమంది దళితులను హింసించి చంపిన పాపం విగ్రహం స్థాపించడంతో జగన్ కు పోదు. 28 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఇతర పనులకు వినియోగించి దళితులకు అన్యాయం చేసిన పాపం విగ్రహ స్థాపనతో పోదు. కోడికత్తి శీను కేసులో నిశితంగా దర్యాప్తు చేస్తే అందులో ప్రథమ ముద్దాయి జగన్ రెడ్డే అని తేలుతాడు. రాజకీయ లబ్ది కోసం జగన్, ఆయన పార్టీవారు పన్నిన హత్యాయత్నం కుట్రలో అసలు సూత్రధారులు జగన్ అండ్ కో, పాత్రధారి కోడికత్తి శీను మాత్రమే.
వరాలిచ్చి ఆ వరాల్ని గాలిలో కలిపే వ్యక్తి జగన్
ఎన్నో వరాలిస్తాడు, చివరకు ఆ వరాలన్నీ గాలిలో కలిపేస్తాడు. జగన్ మాట వేరు, చేసే పని వేరుగా ఉంటుంది. దళితులకు వరాలిస్తాడేగానీ ఆ వరాలు నెరవేరవు. దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానంటాడు, తద్భిన్నంగా అధో పాతాళానికి తొక్కేస్తాడు. జగన్ దళితుల విషయంలో మాటల్లో కాదు చేతల్లో చూపాలి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని దీర్ఘాలు తీసి మరీ చెబుతాడు. కాని వారిని తక్కువ చేసి చూస్తాడు.
జగన్ దళితుల మేనమామనని చెప్పి మోసం చేశాడు
జగన్ తను దళితుల మేనమామ అని చెప్పడంతో ఆ భ్రమతో దళితులు మోసపోయారు. జగన్ మాయ మాటలు చెప్పి మోసం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ ని నమ్మారు. నేను మీ మేనమామను అన్నాడు. దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారు. వర్గాల్ని ఈసడించుకుంటున్నారు.
ఐదున్నరేళ్లలో దళితులపై 6వేల దాడులు జరిగాయి
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు దళితులపై 6వేల దాడులు జరిగాయి. రికార్డులో కూడా నమోదయ్యాయి. 188 మంది హత్య గావించబడ్డారు. జగన్ ముఖ్యమంత్రిత్వంలో వారానికి నలుగురు హత్య గావించబడుతున్నారు. ఆరుగురు దళితులపై వారానికి ఒక హత్యా యత్నం జరుగుతోంది. వారానికి ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితులకు జగన్ పాలనలో రక్షణ లేదు. దళిత మహిళలు ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ లేదు. విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వేస్తే 188 మంది దళితులను చంపిన పాపాలు పోతాయా?
జగన్ కు అంబేద్కర్ పై అభిమానం, గౌరవం లేదు
జగన్ కు అంబేద్కర్ పై అభిమానం, గౌరవం లేదు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏనాడైనా పాటించారా? దళిత మంత్రులు, ఉప ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను అవమానపరిచారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా విదేశీ విద్యావిధానాన్ని ప్రవేశపెడితే… అంతటి మేధావి పేరు పెడితే జగన్ ఆ పథకాలను అమలు చేయలేదు సరికదా ఆ పేరు తీసి జగన్ విదేశీ విద్యా విధానమని పేరు మార్చారు. అంతటి మహనీయుడు, మేధావి, విద్యావేత్త పేరు తీసి జగన్ పేరు పెట్టవచ్చా? నేర చరిత్ర కలిగిన జగన్ ఆర్థిక నేర గాడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. జగన్ ఏం చదివారో, ఎంతవరకు చదివారో ఎవరికీ తెలియదు. అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టడం ఆ సబబా? రాజ్యాంగాన్ని విస్మరించి తోసిపుచ్చి విజయవాడలో 125 అడుగుల విగ్రహం వేస్తే ఆ పాపాలన్నీ పోతాయా?
మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ ను చంపేశారు
డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే చంపేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.160 కోట్లే ఖర్చు పెట్టారు. తాను రూ.404 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే చేసిన పాపం పోతుందా? వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. ఆ పాపం విగ్రహం వేస్తే పోతుందా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ దళితుడు అడ్డుకుంటే ఆ దళితుడిని చంపేశారు. దళిత వ్యక్తి ఏదో ఒ మాట తూలి మాట్లాడిన ఓం ప్రకాశ్ శవమయ్యాడు, డాక్టర్ అచ్చెన్న ను కూడా మీ పొట్టన పెట్టుకున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన నాగమ్మ పశువులు మేపడానికి వెళ్లినపపుడు ఇద్దరు వైసీపీ సానుభూతిపరులు చంపితే శవాన్ని చూడడానికి కూడా వెళ్లలేదు. చూడటానికి టీడీపీ నాయకులు వెళితే వారిపై కేసులు పెట్టారు. ఆ పాపం ఊరికే పోదు.
నా దళిత రైతులు అని చెప్పి చివరకు వారికి బేడీలు వేయించారు
అమరావతిలో ఎన్నికలకు ముందు నా దళిత రైతులు అని మాట్లాడి చివరకు వారిపైన్నే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. 404 కోట్లు ఖర్చు పెట్టి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వేస్తే పాపం పోతుందా? దళిత రైతుల చేతులకు బేడీలు వేశారు, నాగమ్మను చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోమని పోతే వారిపైనా కేసులు పెట్టారు. మీ మాయమాటలు నమ్మే స్థితిలో జనం లేరు, ఓ దళిత వ్యక్తిని వైసీపీ నాయకులు కారులో తీసుకెళ్లారు.
ఆ దళితుడు దాహం దాహం నీరు ఇవ్వమంటే చుట్టూ మీవారు నిలబడి నోటిలో మూత్ర విసర్జన చేశారు, ఆ పాపం ఊరికే పోతుందా? జగన్ రాజకీయ కుట్రలు అందరికీ తెలుసు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం దళిత ఓట్లు పొందడానికి పన్నిన రాజకీయ కుట్ర అని ప్రజలు గ్రహించారు. ఇప్పటికైనా దళితులు చైతన్యవంతులవ్వాలి. ఒక ఫంక్షన్ వైసీపీ నాయకులు పెట్టిన ఫంక్షన్లో దళిత వేమూరి ఎమ్మెల్యే నాగార్జున పేరు ఎవరూ చెప్పలేదు. ఆదమూలపు సురేష్ పేరు ఎవరూ చెప్పలేదు. లైట్ల వెలుగులో జగన్ ముఖం వెలుగుతోందే తప్ప దళితుల ముఖాన నెత్తురు చుక్క లేదు. 28 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెడితే ఈ పాపం పోతుందా?
చంద్రబాబు హయాంలో రైతులకు ల్యాండ్ పర్చసింగ్ స్కీమ్ కింద భూములిచ్చారు
చంద్రబాబునాయుడు ల్యాండ్ పర్చసింగ్ స్కీమ్ పెట్టి అనేకమంది పేదలకు భూములిచ్చి ఎంతోమందిని ఆదుకున్నారు. జగన్ ఒక్క ఎకరం ఇవ్వలేదు, ఈ విషయం జూపూడి ద్వారా తెలుసుకోవచ్చు? మీరు ముఖ్యమంత్రిగా ఒక్క ఎకరం ఎవరికైనా పంచారా? పంచలేదు. చంద్రబాబు బ్రహ్మాండంగా పంచారని ఎవరిని అడిగినా చెబుతారు, జూపూడి ఈ విషయం చెప్పకపోతే ఆత్మవంచన చేసుకున్నట్లే.
జగన్ వేసే ప్రతి అడుగు రాజకీయ లబ్ది కోసమే. మాల, మాదిక, రెల్లి కార్పొరేషన్ పెట్టి కూర్చోవడానికికుర్చి లేకుండా చేవారు., లోన్ ఇవ్వడానికి ఈ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి లేదు. దళితులకు మీరు ఒక్క ఇన్నోవా కారైనా ఇచ్చారా? చంద్రబాబు ఎందరికి ఇచ్చారో జూపూడిని అడగాలి. మీరెంతమందిని వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలబడేలా చేశారు? 7 వేల కార్లు ఇచ్చారు. ఈ పాపాలన్నీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వేస్తే పోతుందా?
జగన్ 28 సంక్షేమ పథకాలను రద్దు చేశారు
దళిత వర్గాల అభివృద్ధికి చంద్రబాబు పెట్టిన 28 సంక్షేమ పథకాలను జగన్ అధికారం చేపట్టిన మొదటి రోజే తీసి పడేశారు. దళితులకు సంక్షేమం అక్కర్లేదు అన్నారు. ఏరకంగా చెబుతారు. అంబేద్కర్ విగ్రహం విగ్రహం ఏర్పాటు రేపు ఎన్నికల సమయంలో లబ్ది పొందడానికే. జగన్ కు దళితులపట్ల చిత్తశుద్ధి లేదు. చిత్తం శివుడిపై భక్తి చెప్పులపై అన్న చందాన జగన్ తీరు ఉంది. ఆయనకు అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. కోడికత్తి శ్రీనుది అదొక పెద్ద కుట్ర.
కోడికత్తితో పొడిపించుకోవడంలో సూత్రధారుడు జగన్. ఆయన పార్టీ నాయకులు పన్నిన కుట్రలో కోడికత్తి శీను బలయ్యాడు. ఆ జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జగన్ మీద ఉన్న ప్రేమ, అభిమానాన్ని ఆసరాగా చేసుకొని జగన్ లబ్ది పొందాడు. కోడికత్తితో గుచ్చించుకొని రాజకీయ లబ్ది పొంది ముఖ్యమంత్రి అయ్యారు. మీ కుట్రలో కోడికత్తి శీను బలిపశువయ్యాడు. ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ విషయంలో జగన్ సమాధానం చెప్పడు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు సరిగా చేయలేదు. ఇది జగన్ పన్నిన కుట్ర.
కోడికత్తి కేసు జగన్ కుట్రే
అధికారంలోకి రావడం కోసం జగన్ ఆడిన డ్రామా ఇది. జగన్ అభిమాని దళిత జనుపల్లి శీను అలియాస్ కోడికత్తి శీను కేసును కూలంకశంగా దర్యాప్తు చేస్తే జగన్ ముద్దాయి అవుతాడు. వారి పార్టీ నాయకులు పన్నిన పన్నాగమే ఇది. కోడికత్తి శీను కేసును ఎందుకు తేల్చడంలేదని న్యాయస్థానాలను ప్రశ్నిస్తున్నాను. ఐదేళ్లుగా చిన్నకేసుపై శీను శిక్ష అనుభవిస్తున్నాడు. అర సెంటిమీటర్ గాయం చేసినదానికి ఇంతపెద్ద శిక్ష? మెడికల్ ఎక్స్ పర్ట్ అరసెంటీమీటర్ గాయానికి 9 కుట్లు ఎలా వేశారు. వైజాగ్ లో ఆసుప్రతి లో వైద్యం చేయించుకొని జగన్ కుట్ర బయట పడేది. హత్యా ప్రయత్నం కేసే ఉండేది కాదు.
అక్కడి పోలీసు స్టేషన్ కు వెళ్లమంటే నిరాకరించారు. జగన్ మేధావి కుట్రను బయటికి తీయాలి. దేశంలో ఎక్కడా ఇలా లేదు. మా దళిత బిడ్డ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ దీక్షకు టీడీపీ పూర్తి మద్దతు పలుకుతున్నాం. కేసు జగన్ ప్రధాన ముద్దాయి అవుతాడు. జగన్ పన్నిన కుట్రను వెలికి తీయాలి. ఐదేళ్లుగా హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా కోడికత్తి శీనును ఎలా ఉంచారో ఎన్ఐఏ మా దళిత జాతికి సమాధానం చెప్పాలి. సీఎం జగన్ కోడికత్తి శీను కేసులో కోర్టుకు హాజరై తన కుట్రలో బలిపశువైన శ్రీనుకు న్యాయం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.