ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు మాట్లడలేని పరిస్థితి
– ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
– బిజెపి వాల్ పెయింట్
– అయోధ్య రాముడు అక్షింతలు పంపిణీ
రాయలసీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్
– అనంతపురం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సుడిగాలి పర్యటన
అనంతపురం… అనంతపురం జిల్లాలో క్షణం తీరిక లేకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటన సాగింది. తొలుత ఉరవకొండ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యడ్లబండి పై ప్రయాణం చేస్తూ ఉరవకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ జాం అయింది. ఉరవకొండ లో స్థానికులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పురంధేశ్వరి ఆవిష్కరించారు.
ఈసందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని తెలిపారు. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనే ఇవాల్టికీ అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు మాట్లడలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు. రాయలసీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్ అభివర్ణించారు అని అందువల్ల రాయలసీమ ఆడపడుచు గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు . ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చారు.
విగ్రహావిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు, దగ్గుబాటి శ్రీ రాం,పోతుల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనంతపురం పట్టణం లో బిజెపి వాల్ పెయింట్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి స్వయం గా నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి పీఠం రోడ్డు లో అయోధ్య రాముడు అక్షింతలు పంపిణీ పురంధేశ్వరి స్వయం గా రామభక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేత లు పాల్గొన్నారు.