Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల ముందు చీకటి జీవో విడుదల

పవర్‌ ప్రాజెక్టుల్లో అంతులేని దోపిడీ
లక్షల ఎకరాల భూములు కొట్టేసేందుకు కుట్ర
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడారు. జగనన్న పాలనలో పవర్‌ ప్రాజెక్టుల ద్వారా అంతు లేనంత దోపిడీ జరిగిందని ఆరోపించారు. జగన్‌కు యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అపరిమిత ‘‘యాక్సిస్‌’’, ఇండోసోల్‌తో అయినా ‘‘సోల్‌’’ ఉంది. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 774.90 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడాన్ని ఆహ్వానిస్తున్నాం. 774.90 మెగావాట్ల పీపీఏ రద్దు చేసినందున రాష్ట్రానికి 7300 కోట్లు నష్ట నివారణ జరిగిందని ఈఆర్సీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం నిబంధనలను అమలు చేయని ఈ సంస్థకు సంబంధించిన మొత్తం 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులు రద్దు చేస్తే రాష్ట్రానికి 40,000 కోట్లు నష్ట నివారణ తథ్యమన్నారు.

774.90 మెగావాట్ల పీపీఏ రద్దు చేస్తే రాష్ట్రానికి 7300 కోట్లు నష్ట నివారణ జరిగితే 1672.80 మెగావాట్లకు యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రభు త్వానికి వచ్చే కనీస నష్టం 16 వేల కోట్ల రూపాయల పైమాటే కాదా? అని ప్రశ్నించారు. 1672.80 మెగావాట్ల ప్రాజెక్టులను రద్దు చేయమని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లిఖిత పూర్వకంగా కోరాయి కదా? అది నిజమా కాదా? అని ప్రశ్నించారు. 1672.80 మెగావాట్ల ప్రాజెక్టుల రద్దు కోరిన అనంతరం 200 కోట్ల బ్యాంకు గ్యారంటీని ఏపీ ట్రాన్స్‌కో నుంచి యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెనుకకు తీసుకు న్నదా, లేదా? అని ప్రశ్నించారు.

పవర్‌ ప్రాజెక్టుల పేరుతో 2.50 లక్షల ఎకరాల భూముల దోపిడీ
ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఫిబ్రవరి 6న జగనన్న క్యాబినెట్‌ ఇచ్చిన జీవో 19 అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోసం 2.50 లక్షల ఎకరాల రెవెన్యూ, అటవీ లేదా ప్రైవేట్‌ భూమి అవసరమన్న కంపెనీ ప్రతిపాదనకు ఈ జీవో అక్రమాలకు నాంది అని పేర్కొన్నారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో అటవీ, రెవెన్యూ, ప్రైవేట్‌ భూముల అన్యాక్రాంతానికి ఈ చీకటి జీవోను విడుదల చేసినట్లు ఆరోపించారు.

ఈ భూములు లీజ్‌ అయితే ఒక ఎకరా రూ.31 వేలు లేదా కొనుగోలు అయితే రూ.5 లక్షలు అని ఒక వైపు తెలుపుతూనే, మరో వంక భూమి బదలాయింపు ధరలు ‘‘కాంపి టెంట్‌ అథారిటీ’’ ద్వారా నిర్ణయం తీసుకుంటాం అన్న మాటల వెనుక చీకటి చట్టం ‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’’ను ఇండోసోల్‌, యాక్సిస్‌ ఎనర్జీస్‌ లాంటి అస్మదీయ కంపెనీలకు ప్రభుత్వం, అటవీ, ప్రైవేట్‌ భూములు తాము అనుకున్న ధరలకు కొట్టేయాలన్న దుష్ట పన్నాగ మని వివరించారు. ఇండోసోల్‌ కోసం నెడ్‌క్యాప్‌ నవంబరు 27, 2023న రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఫర్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాస్తూ, కేంద్రప్రభుత్వం సంస్థ అయిన సెంట్రల్‌ ట్రాన్సిషన్‌ యుటిలిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించామని అభ్యర్థించారు.. మరి ఈ ఏర్పాటుకు అవసరమైన వ్యయం బాధ్యత ఎవరిదో అర్థం కాని పరిస్థితి ఇందులో దాగుందన్నారు. ఈ దోపిడీని ప్రజలు గమనించాలని కోరారు.

LEAVE A RESPONSE