మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు (జేసీఎస్) రాష్ట్ర కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. గృహ సారధుల నియామకం, పార్టీ కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు.