-ఫిబ్రవరి 15, 16 తేదీలలో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్ పోటీలు
-సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రీడలను ప్రోత్సహించడం కోసం సీఎం కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కప్-2023’ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నివాసంలో “కేసీఆర్ కప్ 2023” టోర్నమెంట్ పోస్టర్ ను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , భారత్ జాగృతి జెనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి , ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 15, 16 తేదీలలో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో పోటీలు జరగనున్నాయి.
రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్ రూ. 1,00,000 నగదు, ద్వితీయ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్ & రూ.75,000 నగదు, తృతీయ బహుమతిగా ట్రోఫీ, మెడల్స్ ,రూ. 50,000 నగదు మరియు క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు.
దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ య జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 15 న దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాలలో జరగనున్న దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. దళిత క్రైస్తవ అభ్యున్నతి కోసం, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని దళిత క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించనుండటం అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ , దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.