-చంద్రబాబు ఏనాడూ ప్రాజెక్టులను పట్టించుకోలేదు
-ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు
నంద్యాల: రాష్ట్రంలోని ప్రతీ సాగు, తాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నంద్యాల పర్యటనలో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. రాష్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లకు మరమ్మతులు చేపడుతున్నాము. చంద్రబాబులా వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై ద్వంద్వ వైఖరి ఉండదన్నారు. వైయస్‌ఆర్ కుటుంబం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని, కరువు, చంద్రబాబు కవల పిల్లలు అనే నినాదం కూడా ఉందని గుర్తుచేశారు. నేడు ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని, వర్షం కోసం రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు.