సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

– లిక్కర్ కేసులో మరో బిగ్ వికెట్ అవుట్

ఢిల్లీ: అంతా అనుకున్నదే జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటిదాకా విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, ఈడీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వలేం అని స్పష్టం చేసిన వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు సమయంలో ఆప్ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురయింది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ మంత్రి సిసోడియా జైల్లో ఉండగా, తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించిన సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో సీఎం కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply