Home » వెంకన్నను దర్శించుకున్న సీఎం రేవంత్

వెంకన్నను దర్శించుకున్న సీఎం రేవంత్

– అందరూ మంచిగుండాలె

తిరుపతి: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దర్శించుకుంది. రేవంత్ తన మనుమడితో కాసేపు సందడి చేశారు. మనుమడి పుట్టు వెంట్రుకల కోసం ఆయన తిరుమల వచ్చారు. పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత, రేవంత్ కుటుంబం వైకుంఠం క్యూ ద్వారా వెళ్లి ముడుపులు సమర్పించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నానని రేవంత్ మీడియాకు చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఒక సత్రం, కల్యాణమండపం నిర్మించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకున్నానని రేవంత్ చెప్పారు.

Leave a Reply