Suryaa.co.in

Andhra Pradesh

కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి మృతిపట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అని సీఎం కొనియాడారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని సీఎం అన్నారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

LEAVE A RESPONSE