Suryaa.co.in

Andhra Pradesh

ఏటీసీ టైర్ల ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

8 కంపెనీలకు శంకుస్థాపన

విశాఖ‌: అచ్యుతాపురం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కొద్దిసేప‌టి క్రితం ఏటీసీ టైర్ల ప‌రిశ్ర‌మ‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ముందుగా ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల‌తో ముచ్చటించారు. ఆపై అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో పలు భారీ పరిశ్రమలకు భూమి పూజ చేశారు. పరిశ్రమలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏటీసీ టైర్ల కంపెనీ రెండూ ఫేజ్‌కు, మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశారు.

అచ్యుతాపురం, రాంబిల్లి క్లస్టర్‌ సెజ్‌కు 2000 సంవత్సరం తర్వాత అడుగులు పడ్డాయి. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ సెజ్‌కు కీలక అనుమతులు వచ్చాయి. మొత్తం ఆరు వేల ఎకరాలను సేకరించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్ఈజెడ్‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో స్థానికుల‌కు 75 శాతం ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి లభించ‌నుంది.

LEAVE A RESPONSE