దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు రెండు; “అవినీతి, ఆశ్రితపక్షపాతం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సెలవిచ్చారు.ముమ్మాటికీ నిజం. క్యాన్సర్ లాంటి ఈ రెండు జబ్బులను గడచిన ఎనిమిదేళ్లుగా ఆయన పాలనలో మరింత పెంచి పోషించారన్నది కూడా అంతే నిజం.
దేశ సంపదను కార్పొరేట్లకు అడ్డగోలుగా దోచి పెడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఆదానీ సంపదే దానికి ప్రబల నిదర్శనం.అవినీతి, క్విడ్ ప్రోకో కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడానికి తోడ్పాటును అందించింది, అధికారంలోకి వచ్చాక సంపూర్ణ సహకారం అందిస్తున్నది ఎవరండీ! మోడీ గారి దత్తపుత్రుడుగా ఎవరిని కేంద్ర ఆర్థిక మంత్రి అభివర్ణించారు!
నీతులు చెప్పడంలో, మాటల వాగాడంబరంలో, నినాదాలు ఇవ్వడంలో మోడీ గారు దిట్టే! ఆచరణలో మాత్రం దోపిడీ – అవినీతికి పాల్పడే వాళ్ళకు పుల్ సపోర్ట్. ఆయన ప్రధాన మంత్రిగా ఉండడానికి, ఆయన ప్రభోదిస్తున్న హిందుత్వ అజెండాకు మద్దతిస్తే చాలు ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. అదీ ఆయన రాజనీతి, ఆర్థిక నీతి, పరిపాలనా నీతి

సామాజిక ఉద్యమకారుడు, కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక