సిబిఐ సైబర్ క్రైమ్ సెల్ కు గూడపాటి లేఖ
అమరావతి: ఎంపి గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో క్లిప్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా సిబిఐ సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ సెల్ (చెన్నయ్) జాయింట్ డైరక్టర్ కు ప్రముఖ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. CBI ఆర్డర్ నంబర్ 21/4/99 ప్రకారం కంప్యూటర్ నేరాలు, కంప్యూటరైజ్డ్ వాతావరణంలో జరిగిన నేరాలు, టెలికాం నేరాలు, ఇతర హైటెక్ నేరాలు మొదలైన నేరాల విచారణకు సంబంధించి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిసిఐసి) ను ఏర్పాటు చేశారు. ఈసెల్ అఖిల భారత అధికార పరిధిని కలిగి ఉంటుంది. ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో క్లిప్‌లో అంశాలు క్రిమినల్ నేరం కిందకు వస్తాయి. ఇటువంటి వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా కలిగే గాయంగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియో క్లిప్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వేర్వేరు సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం పెరిగి సామరస్య వాతావరణం దెబ్బతింటుంది. వీడియో క్లిప్‌లో ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్యకరమైన రాజీ వైఖరి మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇటువంటి దారుణమైన, అసభ్యకరమైన అంశాలు పునరావృతం కాకుండా చూసేందుకు పార్లమెంటు సభ్యుడు (లోక్‌సభ) గోరంట్ల మాధవ్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గూడపాటి లక్ష్మీనారాయణ విజ్జప్తి చేశారు.లక్ష్మీనారాయణ తన ఫిర్యాదును ఈ-మెయిల్ ద్వారా చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి పంపారు. ఫిర్యాదుతో పాటు మాధవ్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను కూడా జతచేశారు. మాధవ్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవ్ వ్యవహారంలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐని కోరారు