-200 వాహనాలతో అతను వస్తే కలెక్టర్ ఎలా స్వాగతం పలుకుతారు ?
– కలెక్టర్ స్వయంగా తన మీద ఎలాంటి దాడి చేయలేదు అన్న మాటలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి
– కలెక్టర్ స్వయంగా తన మీద ఎలాంటి దాడి చేయలేదు అన్న మాటలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి
– నరేందర్ రెడ్డి కేటీఆర్ కు ఫోన్ చేసినంత మాత్రాన కేటీఆర్ నిందితుడు అవుతాడా ?
– లగిచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : కనీసం వార్డ్ మెంబర్ కూడా కానీ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. దీనికి డీజీపీ బాధ్యత వహించరా ? 200 వాహనాలతో అతను వస్తే కలెక్టర్ ఎలా స్వాగతం పలుకుతారు ? దీనిని బట్టి మీరు ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు ? ఫార్మా విలేజ్ ల విషయంలో రేవంత్ ది వ్యూహాత్మక తప్పిదం. ప్రభుత్వ నిర్ణయం మీద ప్రజలు బహిరంగంగా తిరుగుబాటు చేశారు .. ఇందులో కుట్ర ఏముంది? సీఎం సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎన్ని సార్లు వారితో సమావేశం అయ్యారు ? ఎన్ని సార్లు ఆ ప్రయత్నం చేశారు ? ప్రజలకు అనుమానాలు ఉన్పప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అక్కడి ఎమ్మెల్యే అయిన సీఎం రేవంత్ రెడ్డికి లేదా ?
కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఫార్మా సిటీకి 14 వేల ఎకరాలు సేకరించినప్పుడు ప్రజలను ఒప్పించి సమకూర్చి పెట్టారు. 2013 భూసేకరణ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందే . అందులో ఉన్న అనేక ఆటంకాలను అధిగమించి కేసీఆర్, కేటీఆర్ ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించినా దానిని పక్కన పెట్టడం వెనక అంతర్యమేమిటి ?
బీఆర్ఎస్ హయాంలో అనేక రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రజలను ఒప్పించి తీసుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకలుు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, కోదండరెడ్డి తదితరులు ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు భూములు ఇవ్వవద్దని రెచ్చగొట్టారు.ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ నేతల మాదిరిగా చేయడం లేదు. కేసులు సమస్యలకు పరిష్కారం కాదు. ప్రజలను ఒప్పించి, మెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
జరిగిన ఘటన గురించి ప్రశ్నిస్తే దానికి మద్దతు పలికినట్లు ప్రచారం చేయడం సబబు కాదు. లగిచర్ల అనంతర పరిణామాలలో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్యకర్తల నుండి ఫోన్లు వచ్చినంత మాత్రాన పట్నం నరేందర్ రెడ్డి నిందితుడు అవుతాడా ? నరేందర్ రెడ్డి కేటీఆర్ కు ఫోన్ చేసినంత మాత్రాన కేటీఆర్ నిందితుడు అవుతాడా ? మరి అదే రోజు కేటీఆర్ వ్యవసాయ అధికారులకు, డీజీపీకి కాల్ చేశారు .. వారిని కూడా నిందితులను చేస్తారా ?
మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద కత్తికడతారా ? వారికి మేలు చేసే పనిచేస్తే మీరు వారికి నచ్చచెప్పి ఒప్పించండి. జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ స్వయంగా తన మీద ఎలాంటి దాడి చేయలేదు అన్న మాటలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి. నిరక్షరాస్యులైన రైతులకు ఎవరు ఆర్డీఓ, ఎవరు కలెక్టర్ అన్న విషయం తెలుస్తుందా ? వారి లోపల ఒక ఆందోళన ఉంది. జరిగిన ఘటన మీద కక్ష్యగట్టి వ్యవహరిస్తారా ? పెద్ద మనసుతో జరిగిన ఘటన మీద సమీక్ష చేసుకోరా ?
కలెక్టర్ స్వయంగా తన మీద ఎలాంటి దాడి చేయలేదు అన్న మాటలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి. నరేందర్ రెడ్డి ఏదైనా గ్రామానికి వెళ్లి ప్రజలను రెచ్చగొట్టారా ? ప్రతిపక్ష పార్టీ నేతగా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరపున ప్రశ్నిస్తారు.తెలంగాణలో ఏమైనా రాచరికం నడుస్తుందా ? ప్రజలు వద్దన్నా ఖచ్చితంగా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోవాలా బీఆర్ఎస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలం వందలమార్లు భూసేకరణ కోసం ప్రజల వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి వారిని ఒప్పించాం.
కాంగ్రెస్ నేతల మాదిరిగా ఎకరాకు రూ.20 లక్షలు అడగండి, రూ.30 లక్షలు అడగండి అని ప్రజలను మేము ఎవరం రెచ్చగొట్టడం లేదు కదా ? రాజ్యం చట్టాన్ని అడ్డగోలుగా వాడుకుంటుంది అంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. బీఆర్ఎస్ నేతల మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇక్కడ ఎవరూ కేసులకు భయపడేవారు లేరు. బీజేపీ ఎంపీ, సీపీఎం నేతలు కూడా ప్రజలను ఒప్పించి భూములు సేకరించాలి అని చెబుతున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ దిశగా అడుగులు వేయాలి.
గతంలో కాంగ్రెస్ హయాంలో ముదిగొండ కాల్పులు జరిగిన తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో తెలుసు. విద్యుత్ ఛార్జీల మీద చంద్రబాబు కాల్పులు జరిపితే ఏం జరిగిందో తెలుసు కొడంగల్ లగిచెర్ల ఘటన మీద కూడా భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా జవాబు చెబుతారు. లగిచర్ల ఘటనలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం