– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ళ లయోలా క్రీడా మైదానంలో 12త్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ పోటీలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు.
క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడం క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు రాత పరీక్షల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను స్పోర్ట్స్ మెన్ అని క్రీడాకారుల ఇబ్బందులు తెలుసని కన్నా అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.