– గవర్నర్ కు బీజేపీ ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని తెలంగాణ విమోచన కమిటీ సభ్యుడు, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ సి.అంజి రెడ్డి కలిశారు. ఈ నెల 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా, నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర ఆధారంగా రూపొందిన “రజాకార్” సినిమాను సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాను తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, గూడూరు నారాయణ్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, పి.విక్రం రెడ్డి, నందకం దివాకర్, పాతూరి కరుణ పాల్గొన్నారు.