Suryaa.co.in

Features Sports

వీళ్ళు ..వీళ్ళ కామెడీలు!

రెజ్లర్ క్రీడాకారులు చెప్పని జవాబులు ఇవీ..
1) లైంగిక వేధింపులు జరిగినప్పడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
2) 2016లో జరిగితే 2023లో ఎందుకు ధర్నాకు దిగారు?
3) లైంగిక వేధింపులు జరిగినట్లు ఏమైనా ఆధారాలున్నాయా?
4) సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగున్నప్పటికీ ధర్నా చేయడంలో మతలబేమిటి?
5) అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా?
6) అసలు ఈ ఘటనకు ప్రధాని మోదీకి సంబంధమేమిటి? మోదీని దించాలని ధర్నా చేయడంలో మతలబేమిటి? ప్రధానిని దించేస్తాం అన్న నినాదాలు ఎవరిని మెప్పించడానికి? ఆ నినాదాల వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరు?
7) ఇన్ని నెలలు ఒక సాధారణ క్రీడాకారులు మీడియాను మేనేజ్ చేయగలరా? మరి వీరి వెనుక శక్తులెవరు?
వీటికి ఇప్పటిదాకా ఏ క్రీడాకారిణీ జవాబు ఇవ్వలేదు. ఇకపై ఇస్తారో లేదో కూడా తెలియదు.

2016 లో లైంగిక వేధింపులు జరిగితే 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు దాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తారోకో చేస్తున్నారంట!
అసలు విషయం ఏంటంటే.. అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనాలంటే జాతీయస్థాయి క్రీడలలో ప్రతిసారి అర్హత సాధించిన తర్వాతనే ఆడే లా, కొత్తగా రూల్ చేయమని మిగతా క్రీడాకారులు, బ్రిజ్ భూషణ్ కుమార్ ను అడిగారు.

న్యాయసమ్మతమైన ఈ కోరికను ఆయన గౌరవించి.. గతంలో సాధించిన మెడల్స్ కారణంగా ప్రస్తుతం ఫిట్నెస్ను పరిగణలోకి తీసుకోకుండా, డైరెక్ట్ గా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే విధానం పక్కన పెట్టి, జాతీయస్థాయి పోటీలలో తమ సత్తా చాటితేనే, అంతర్జాతీయ వేదికలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తాం అని చెప్పడం జరిగింది.

గతంలో మేము అంతర్జాతీయ మెడల్స్ సాధించాం కాబట్టి.. మేము ఏం చెప్పినా చెల్లుబాటు కావాలి అని భావించిన ఈ అమాయక ఉన్మాద ఆడ లేడీస్, ఈ కారణాన్ని మనసులో పెట్టుకుని.. ఎప్పుడో ఏడేళ్ల క్రితం మమ్మల్ని లైంగికంగా వేధించారు అని చెప్పి డ్రామా మొదలుపెట్టారు. ఒకవేళ ఈ లైంగిక వేధింపు ఈ మధ్యకాలం జరిగింది అన్న విషయం చెబితే, విచారణలో బయటపడే అవకాశం ఉందని.. ఎప్పుడో ఏడేళ్ల క్రితం జరిగిందని చెబితే సహజంగా స్త్రీలు చెప్పింది నమ్ముతారని, ఇలాంటి డ్రామాలు మొదలెట్టారు.

ఇక్కడ వీళ్లను గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఒకవేళ లైంగిక వేధింపులు జరిగిందన్న విషయం నిజమే అయితే.. వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సింది ఆ ఎంపీ ని!

మరి ఆ ఎంపీ ని గత ఏడు సంవత్సరాలుగా ఎందుకు, వీరి ఇంటిలో జరిగిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించారు? ఆయన పాల్గొన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అంటే లైంగిక వేధింపులు జరిగాయని వీళ్ళు చెప్పిన తరువాత, పళ్ళు ఇకిలిస్తూ ఆ వ్యక్తితోనే ఇలా అంత సందడి గా ఉన్నారో మిలియన్ డాలర్ ప్రశ్న? వీళ్ళ అంతర్గత ఎజెండా ఎంత సేపు.. బిజేపి కి, హిందువులకి వ్యతిరేకం గా ఉండడం కాబట్టి.. అవన్నీ పట్టించుకోకుండా ఇలా ఏడుస్తూ ఉంటారు.

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE