రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.7660కోట్ల పంచాయతీల నిధులను దొంగిలించి వేసిందంటూ ఫిర్యాదు చేస్తూ ఈరోజు లేఖ వ్రాసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్.

రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు (2018 నుంచి 2022 వరకు) రూ,, 7660 కోట్లను సర్పంచులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన సొంత పథకాలకు, అవసరాలకు వాడేసుకుంది. సర్పంచుల చెక్కుల పై సంతకాలు లేకుండా, సర్పంచులకు చెప్పకుండా, గ్రామ పంచాయతీల, గ్రామ సభల తీర్మానాలు లేకుండా పంచాయితీ సర్పంచ్ ల cfms అకౌంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ,,7660 దొంగిలించివేసింది. గ్రామ పంచాయతీల అకౌంట్లు జీరో/ నిల్ బ్యాలెన్స్ లు చూపించడంతో సర్పంచులు షాక్ కు గురయ్యారు.

గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, డ్రైన్లు, శానిటేషన్ మొ,, అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోమని కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి వేసి తన సొంత పథకాలకు, అవసరాలకు వాడి వేసుకుంది. ఇది 14, 15 వ ఆర్థిక సంఘాల నిబంధనలకు వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం, న్యాయ వ్యతిరేకం, నైతిక విరుద్ధమైన దారుణమైన చర్య. దీనితో గత మూడు సం,, లుగా 12918 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయి, సర్పంచులు ఉత్సవ విగ్రహాలు లాగా మిగిలిపోయారు. గ్రామీణ ప్రజలు పనులు చేయడం లేదని సర్పంచులను నిలదీస్తున్నారు, తిడుతున్నారు. గత మూడు సం,,లుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ రూ.7660 కోట్ల ను హైజాక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడేసుకుంటోంది.

కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ నిధుల మళ్లింపు పై విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించి, తగిన చర్యలు తీసుకొని, దొంగిలించ బడ్డ ఆ రూ,, 7660 కోట్ల నిధులను మా గ్రామ పంచాయతీలకు – సర్పంచులకు తిరిగి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి మోరేశ్వర్ పాటిల్ కి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఈరోజు లేఖ వ్రాయడం జరిగింది.

నమస్కారాలతో
వై.వి.బి. రాజేంద్రప్రసాద్
అధ్యక్షులు- ఆం.ప్ర. పంచాయతీ రాజ్ ఛాంబర్.
వ్యవస్థాపక అధ్యక్షులు- ఆం.ప్ర. సర్పంచుల సంఘం.