గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అపశృతి

-డిలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర నిర్వాహకులు అందరికీ కిట్లు ఇవ్వలేదు
-కౌంటర్ పీకి పందిరి
-అందరికీ అందని కిట్లు
-కనిపించని పోలీసులు
-డెలిగేషన్‌ రిజిస్ట్రేషన్‌ దగ్గర రసాభాస

ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నిర్వహణలోపంలో రసాభాసగా మారింది. డెలిగేట్లకు కిట్లు పూర్తి స్థాయిలో అందకపోవడంతో, వారు ఇల్లుపీకి పందిరేసినంత పనిచేశారు. అంత జరుగుతున్నా ఆ సమయంలో పోలీసులు కనిపించకపోవడం ఆశ్చర్యం.

విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో అపశృతి చోటు చేసుకుంది. డిలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర నిర్వాహకులు అందరికీ కిట్లు ఇవ్వలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఏకంగా కౌంటర్ ను పీకి పందిరి వేశారు. వెంటనే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయినా ఫలితం లేకపోయింది. వాళ్లు వచ్చేనాటికే మొత్తం అయిపోయింది. కౌంటర్ మొత్తం డెలిగేట్ పాస్ హోల్డర్లు పీకేశారు. ఈ ఘటనలో పోలీసులు దగ్గరలేకపోవడం విశేషం.

ఏపీకి ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ ద్వారా వచ్చిన పెట్టుబడులు ఇవే..
►ఎన్టీపీసి ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)
►ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)
►రెన్యూ పవర్‌ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)
►ఇండోసాల్‌ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)
►ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)
►టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)
►జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు)
►హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు)
►అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు)
►గ్రీన్‌ కో ఎంవోయూ(47, 600 కోట్లు)
►ఓసీఐఓఆర్‌ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)
► హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ (రూ. 30వేల కోట్లు)
► వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (రూ. 21,844 కోట్లు)
► అదానీ ఎనర్జీ గ్రూప్‌ (రూ.21, 820 కోట్లు)
►ఎకోరెన్‌ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)
►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు)
►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు)
► అరబిందో గ్రూప్‌ (రూ.10, 365 కోట్లు)
►ఓ2 పవర్‌ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు)
► ఏజీపీ సిటీ గ్యాస్‌ (రూ. 10వేల కోట్లు)
► జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)
►ఆదిత్య బిర్లా గ్రూప్‌ (రూ. 9,300 కోట్లు)
►జిందాల్‌ స్టీల్‌ (రూ. 7500 కోట్లు)
►టీసీఎల్‌ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు)
►ఏఎం గ్రీన్‌ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు)
►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు)
►ఐపోసీఎల్‌ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు)
►వర్షిణి పవర్‌ ఎంవోయూ(రూ, 4,200 ‍కోట్లు)
►ఆశ్రయం ఇన్‌ఫ్రా(రూ. 3,500 కోట్లు)
►మైహోమ్‌ ఎంవోయూ(3,100 కోట్లు)
►వెనికా జల విద్యుత్‌ ఎంవోయూ(రూ. 3000 కోట్లు)
►డైకిన్‌ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు)
►సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
►భూమి వరల్డ్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
►అల్ట్రాటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)
►ఆంధ్రా పేపర్‌ ఎంవోయూ(ర. 2వేల కోట్లు)
►మోండాలెజ్‌ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు)
►అంప్లస్‌ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు)
►గ్రిడ్‌ ఎడ్జ్‌ వర్క్స్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
►టీవీఎస్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
►హైజెన్‌కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
►వెల్స్‌పన్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)
►ఒబెరాయ్‌ గ్రూప్‌(రూ. 1,350 కోట్లు)
►దేవభూమి రోప్‌వేస్‌(రూ. 1,250 కోట్లు)
►సాగర్‌ పవర్‌ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు)
►లారస్‌ గ్రూప్‌(రూ. 1,210 కోట్లు)
►ఎలక్ట్రో స్టీల్‌ క్యాస్టింగ్స్‌(రూ. 1,113 కోట్లు)
►డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌(రూ. 1,110 ‍కోట్లు

Leave a Reply