Suryaa.co.in

Telangana

పంతం నెగ్గించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు భేష్

ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని.. హిందూ విరోధి చాంద్రయాణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎదుట తాము ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేమని భీష్మించి.. అనుకున్నట్లుగానే శపథం నెరవేర్చుకున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అభినందనీయులు. చివరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ప్రమాణం చేసి శభాష్ అనిపించుకున్నారు.

భారత ప్రజాస్వామ్యానికి, లౌకిక వాద వ్యవస్థకు మచ్చ తీసుకువచ్చే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన “15 నిమిషాలు” మాటలు హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. “15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ఈ దేశంలోని హిందువులందరినీ హత మారుస్తా”నని శపథం చేసిన హిందూ విరోధి అక్బరుద్దీన్ ఎదుట తాము ప్రమాణం చేయలేమని నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించడం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకం.

రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై ఎటువంటి విశ్వాసం లేని వ్యక్తిని అత్యంత ఉన్నతమైన కుర్చీపై కూర్చోబెట్టడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అని చెప్పక తప్పదు. సంప్రదాయం ప్రకారం శాసనసభలో సీనియర్ శాసనసభ్యుడిని ప్రోటెం స్పీకర్ గా నియుక్తి చేసి, వారి చేత ఎమ్మెల్యేలను ప్రమాణం చేయించే సంప్రదాయం సరైనదే. కానీ “సభలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దలను కాదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హిందూ విరోధి ఎంఐఎం ఎమ్మెల్యే ఓవైసీని ప్రోటేమ్ స్పీకర్ గా నియమించి రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ది” అని చెప్పడం సరైనదే.

ఈ క్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా లౌకిక స్ఫూర్తికి కఠిబద్దులుగా ఉంటూ.. రాజ్యాంగాన్ని కాపాడుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీ నూతన ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ ఎదుట ప్రమాణ స్వీకారం చేయకపోవడం అత్యంత ఉత్తమమైన, ఉన్నతమైన నిర్ణయం.

పోలీసులు రక్షణగా ఉన్నారు కాబట్టే హిందువులు ప్రాణాలతో బతుకుతున్నారని, ఒకవేళ పోలీసులు విధులనుంచి తప్పుకుంటే హిందువులను ఊచకోత కోస్తామని ప్రకటించిన విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం పార్టీ అనుకున్నట్టుగానే స్పష్టంగా వ్యవహరిస్తోంది.

గతంలో “కల్వకుంట్ల పార్టీ”కి అత్యంత సన్నిహితంగా ఉంటూ.. కారు స్టీరింగును స్వయంగా తామే నడిపింది మజిలీస్ పార్టీ. అయితే 2023 డిసెంబర్ మూడో తేదీన బీ ర్ యస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత, ఊహించిన విధంగానే కాంగ్రెస్ పంచన చేరడం ఎంఐఎం అవకాశవాద రాజకీయాలను గుర్తుచేస్తోంది.

హిందూ సమాజంపై విషం చిమ్ముతూ.. హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవులను హత్య చేస్తూ.. హిందూ అమ్మాయిలపై విషపు వల వేస్తూ లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తూ.. హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయాలనే కుట్రలతో పనిచేస్తున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయడం దుర్మార్గం.మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు సభ్యులమున్న తామే ప్రతిపక్షం అని విర్రవీగిన ఎంఐఎం పార్టీ సంఖ్యను అధిగమించి.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ సభ్యులు ఘనులు.

కామారెడ్డిలో ముఖ్యమంత్రులను మట్టి కరిపించిన చరిత్ర బిజెపిది..!

ముఖ్యంగా కామారెడ్డి విషయానికి వస్తే అప్పటి సిట్టింగ్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నీ.. అంటే ఇద్దరు సీఎంలను ఒకేసారి ఒంటి చేత్తో ఓడగొట్టిన ధీరుడు కాటేపల్లి వెంకటరమణారెడ్డి కి ప్రత్యేక అభినందనలు. ఇక రాజాసింగ్ విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందుత్వ ఎజెండాతో రాజకీయ అడుగులు వేసిన హిందూ సామ్రాట్ రాజాసింగ్ చరిత్ర సృష్టించారు. గతంలో కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి రికార్డును సమం చేసి గోషామహల్ నియోజకవర్గం లో హ్యాట్రిక్ విజయం సాధించిన ధీరుడు రాజాసింగ్.

పార్టీలో కొన్ని ఇబ్బందులు కలిగినా.. కొంత సౌకర్యం ఏర్పడినా.. పార్టీని పల్లెత్తు మాట అనకుండా, పార్టీ గీత దాటకుండా, పనిచేసి పార్టీ క్రమశిక్షణను కాపాడిన వ్యక్తి రాజాసింగ్. ఎన్నికల సమయంలో జరిగిన చర్చల విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రాజాసింగ్ విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు అని ప్రతి హిందువు ధీమాగా చెప్పిన మాట మరువలేనిది. నిర్మల్ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని భారీ మెజారిటీతో ఓడించిన చరిత్ర ఉమామహేశ్వర రెడ్డి ది. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పాయల్ శంకర్ , ఆర్మూర్ నుంచి రాకేష్ రెడ్డి , సిర్పూర్ నుంచి హరీష్ బాబు , ముధోల్ నుంచి రామారావు పటేల్ , నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విజయం సాధించడం అభినందనీయం. హిందుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను అవమానించిన హిందూ విరోధి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎదుట శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకపోవడం హర్షనీయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

మొత్తంగా తెలంగాణ మూడవ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది. 8 మంది సభ్యుల విజయం పొందగా.. 14% ఓట్లు సాధించడం.. ఎంఐఎం పార్టీని వెనక్కి నెట్టి సంఖ్యాబలం ప్రదర్శించడం చాలా గొప్ప విషయం.

– పగుడాకుల బాలస్వామి
JAT, ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్

9912975753
9182674010

LEAVE A RESPONSE