Suryaa.co.in

Andhra Pradesh

మోపిదేవికి రేపల్లె బాధ్యత ఇవ్వకపోతే వైసీపీని ఓడిస్తాం

-అప్పుడు పట్టుదలతో వైసీపీని గెలిపించాం
-ఇప్పుడు అంతే పట్టుదలతో ఓడిస్తాం
– అగ్నికులక్షత్రియ జాతీయ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షల మంది జనాభా కలిగి ఉండి అత్యంత వెనుకబడిన అగ్నికులక్షత్రియ సామాజిక వర్గంలో జన్మించి గత 25 ఏళ్లుగా రేపల్లె నియోజకవర్గం లో పేదల పెన్నిధిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులై ఎం పి పి గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి .. అంచెలంచెలుగా ఎదిగి గత ప్రభుత్వం ల లో మూడు సార్లు ఎం ఎల్ ఏ గా, రెండు సార్లు మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహించి, 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రావటానికి కీలక పాత్ర పోషించిన మోపిదేవి వెంకట రణమా రావు ని జనాభా ప్రాతిపదిక అని సాకు చూపి, వై సి పి ప్రభుత్వం రేపల్లె నియోజకవవర్గ బాధ్యతలు వేరే కులస్తులకు అప్పచెప్పటాన్ని అగ్నికులక్షత్రియ జాతి మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది.

వైసీపీ ప్రభుత్వం మోపిదేవి వెంకట రమణ రావుకి మాత్రమే కాదు మా అగ్నికులక్షత్రియ సామజిక వర్గం మొత్తానికి జరిగిన తీవ్రమైన అన్యాయం చేసినట్లుగా మేము పరిగణిస్తున్నాము.గతంలో అనేక సార్లు ఎం ఎల్ ఏ గా, మినిస్టర్ గా, 40 లక్షల మంది అగ్నికులక్షత్రియులకు ప్రతినిధిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ రావు నే వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే , మిగతా సామాన్యుల మరియు సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? వారికి ప్రాతినిధ్యం వుంటుందా ఈ ప్రభుత్వం లో? అని ఆవేదన చెందుతున్నాము.

జనాభా ప్రాతిపదికనే పరిగణనలోకి తీసుకుంటే… అగ్నికులక్షత్రియులు అత్యధిక జనాభా కలిగిన అవనిగడ్డ నియోజకవర్గాన్ని, మోపిదేవి వెంకట రమణ రావు కి ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.తక్షణమే ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి అగ్నికుల క్షత్రియ యావత్ జాతి తరపున రేపల్లె లేదా అవనిగడ్డ నియోజకవర్గ బాధ్యతలు మోపిదేవి వెంకట రమణారావు కి కేటాయించాలని అగ్నికులక్షత్రియ జాతీయ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు డిమాండ్ చేశారు.

మా డిమాండ్ పరిగణన లోకి తీసుకోక పోతే 2019 ఎలక్షన్స్ లో అగ్నికులక్షత్రియ ప్రత్యేక కార్పొరేషన్ కోసం, తీరా ప్రాంతం లలో మా వారు ఉన్న అన్ని నియోజక వర్గాలలో వై సి పి ని ఎలా గెలిపించామో.. అంతకంటే దారుణంగా 2023 ఎలక్షన్స్ లో వై సి పి ని ఓడిస్తాము అని హెచ్చరిస్తున్నాము.

LEAVE A RESPONSE