Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ 6 గ్యారంటి లు ఇప్పట్లో అమలు సాధ్యం కాదు

-ఆరోపణలు లేని ప్రభుత్వాలు దేశంలో లేవు
-పార్టీ అదేశిస్తే నల్గొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుండి పోటీ
-ఏ ప్రభుత్వం అయినా హుందాతనంగా వ్యవహరించాలి
-శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ” పార్టీ అదేశిస్తే నల్గొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుండి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారు.తెలంగాణలో 4 జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. మిగతా జిల్లాలలో మిక్సుడ్ ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్, మెదక్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యం కనిపించింది .ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కలలో కూడా అనుకోలేదు . ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉండాలని ప్రజలంతా అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఫలితం తారుమారైంది.

నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. నా వంతుగా ప్రాజెక్టులపై సూచనలు, సలహాలు అందించాను.కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రోటోకాల్ ను పకడ్బందీగా అమలు చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటి లు ఇప్పట్లో అమలు సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సృష్టించిన ఆస్తుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తుంది. పార్లమెంటు పై పొగ బాంబ్ దాడి భద్రత లోపాలలను స్పష్టంగా చూపిస్తుంది . ప్రభుత్వాలు రాష్ట్ర భవిషత్తు గురించి, అభివృద్ధి కోసం పని చేయాలి .అంతేకాని పట్టుదలకు పోయి చతికలపడొద్దు. ఆరోపణలు లేని ప్రభుత్వాలు దేశంలో లేవు. అలాగే బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై కూడా ఆరోపణలు చేస్తున్నారు . ఏ ప్రభుత్వం అయినా హుందాతనంగా వ్యవహరించాలి.

LEAVE A RESPONSE