– మీరు రహస్యంగా గడ్కరీ, అమిత్ షాని కలిసిన విషయం తెలుసు
– బిజెపికి సీబీఐ పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్ గా పనిచేస్తుందని మీ రాహుల్ అంటాడు
– నువ్వేమో సీబీఐకి విచారణకు ఇస్తావు
– సచ్చిన శవాలను తీయడానికి ఇప్పటి వరకు దిక్కులేదు
– ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు
– యూరియా కొరతపట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యెక్క అసమర్థత స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిండ్రు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత లేదు.
రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించినం. వాళ్ల పార్టీ మంత్రులే యూరియా లేదటుంటే.. రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెబుతున్నారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డ రైతులు, మహిళలు కడుపుమండి బూతులు తిడుతుంటే వినబడట్లేదా?
2014 కు ముందు నీళ్లకోసం కొట్టుకున్నోళ్లు. నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి. ఇంకా కేసీఆర్ ను, కేటీఆర్ ను తిట్టుడు తప్ప వేరే పనేలేదు. ప్రజల డబ్బులు దండుకోవడంలో మంత్రులు పోటీ పడుతున్నరు. ఈ రాష్టంలో పనిచేస్తున్న ఏకైక శాఖ పోలీస్ శాఖ మాత్రమే. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నరు. పోలీసులు రాజకీయలకతీతంగా పనిచేయాలి.
కేసీఆర్ హయాంలో ఎంత ప్రశాంతంగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. మీకు కూడా తెలుసు. హాస్టళ్లల్లో భోజనం సరిగా లేదని పిల్లలే ధర్నా చేసే పరిస్థితి. మెస్ చార్జీలు సరిగా రావడం లేదు. చిన్న చిన్న వ్యాపారుల దగ్గర అప్పులు చేసి హాస్టళ్లు నడుపుతున్నారు.
ఇవాళ కిరాణా కొట్లు, కూరగాయల వ్యాపారుల దయాదాక్షిణ్యాల తో హాస్టళ్ళు నడిచే పరిస్థితి. వెల్ఫేర్ ఆఫీసర్లు వాళ్ళ జీతంతోనే హాస్టల్ నడుపుతున్నారు. రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. విద్యాశాఖ దగ్గర పెట్టుకుని పిల్లల జీవితాలతో ఆటలాడుతున్న రేవంత్. ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది.
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి దేశవ్యాప్తంగా పెరుగాంచించింది. కరోనా సమయంలో ఎనలేని సేవలందించినం. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వైద్యమంటే భయపడే పరిస్థితి తెచ్చిండ్రు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జగదీష్ రెడ్డి
నీళ్లను వాటర్ లో కలిపే మంత్రులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. వందల టీఎంసీల నీళ్లు ఒకపక్క సముద్రంలో కలుస్తుంటే, నల్లగొండ గడ్డపైన ఉన్న ఎస్సెల్బీసీ ఉదయ సముద్రం ఎండిపోతుంది. అయినా ఇంకా ఎస్సెల్బీసీ పూర్తిచేస్తామని చెప్పడం సిగ్గుచేటు.
సచ్చిన శవాలను తీయడానికి ఇప్పటి వరకు దిక్కులేదు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాళేశ్వరం సీబీఐ కి అప్పగించి మోడీని కలుస్తారంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రండలాగా వ్యవహరిస్తోంది. ఎప్పటికైనా నువ్వు నీ సీఎం రేవంత్ బీజేపీ లో చేరేవాళ్లే. మీరు ఢిల్లీకి వెళ్లి రహస్యంగా గడ్కరీని, అమిత్ షాని కలిసిన విషయం తెలుసు.
తెలంగాణ పోలీసే గొప్ప అని ఎన్నో అవార్డులు తీసుకుంది. కేసులు చేదించడంలో.. టెక్నాలజీని వాడడంలో తెలంగాణ పోలీసే నెంబర్ వన్. ఓ పక్క మీ రాహుల్ గాంధీ సీబీఐ, ఈడీ లు, ఐటీ డిపార్ట్ మెంట్ లు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నాయని బీహార్ లో మొత్తుకుంటున్నాడు. బిజెపికి సీబీఐ పొలిటికల్ రిక్రూట్మెంట్ సెంటర్ గా పనిచేస్తుంది అంటుండు.
మీరేమో మేము, మా పోలీసులకు చేతకాదు. అందుకే సీబీఐ కి అప్పజెప్తమని సిగ్గులేకుండా తీర్మానం చేసుకుంటున్నారు. ఇంకా సరిపోకుంటే మీరు, మీ సీఎం పోయి ఎఫ్బిఐ ఇచ్చుకోండి.. కాదంటే నేతన్యాహు కాళ్లుపట్టుకుని మోసాద్ ఇచ్చుకోండి.
నీళ్ళల్ల వాటర్ కలుపుతావో.. వాటర్ ల నీళ్లు కలుపుతావో నల్లగొండ ప్రజలకు మాత్రం నీళ్లు ఇవ్వు. కృష్ణా నీళ్లు సముద్రం పాలయితుంటే, నల్లగొండ రైతులకు నీళ్లు లేకుండా అయితున్నాయి. ఇది నల్లగొండ మంత్రుల పనితీరు.