Suryaa.co.in

Telangana

తెలంగాణ‌ను క‌మ్మేసిన కాంగ్రెస్ మేనియా

-హోరెత్తుతున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌
-ఖ‌మ్మంలో ముగింపు బ‌హిరంగ స‌భ‌
-న‌గ‌రంలో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు
-మూడు రంగుల తోర‌ణాల‌ మ‌ధ్య వెలుగుతున్న ప‌ట్ట‌ణం
-ముఖ్య అతిథిగా వ‌స్తున్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ
-1360 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేసిన భ‌ట్టి
-రాహుల్ గాంధీ ప్ర‌త్యేక ఏర్పాట్లు
-రాష్ట్ర కాంగ్రెస్ కేడ‌ర్ లో కొత్త జోష్
-కేడ‌ర్ లో స్ఫూర్తి నింపిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ (హాథ్ సే హాథ్ జోడో) పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఖమ్మం న‌గ‌రంలో ఏర్పాటు చేసిన జ‌న‌ గర్జన స‌భ‌కు ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఈ స‌భ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి.

అగ్ర‌నేత రాహుల్ గాంధీనే భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భకు హాజ‌రవుతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ల‌క్ష్యంతో అన్ని సిద్ధం చేశారు.

భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో.. కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భ‌ట్టి విక్ర‌మార్క భరత వాక్యం పలికాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందని పించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే… ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత.. కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు.. వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు.. మరెన్నో ప్రజాసమస్యను గుర్తించ‌డానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ ఎవరూ క‌న్నెత్తి చూడ‌డానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ.. స్వ‌తంత్ర తెలంగాణ రాజ‌కీయాల‌కు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొద‌లుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా భట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రేస్ మేనియా మొద‌లైంది. తాజాగా ఖ‌మ్మం న‌గ‌రంలో త‌ల‌పెట్టిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌తో భట్టి విక్ర‌మార్క నామ‌స్మ‌ర‌ణ హోరెత్తుతున్నది.

ముస్తాబైన ఖ‌మ్మం
ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో అలంకరించారు. ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లు
ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20X20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు.

LEAVE A RESPONSE