– ఉల్లిగడ్డ బాంబు కూడా పేలలేదే..
– ఆ ఎంపి పేరు చెబుతానంటివి కదా?
– కేటీఆర్ హెచ్‌సియు భూముల గడువుపై కాంగ్రెస్ ఎంపి చామల వ్యంగ్యాస్త్రం
హైదరాబాద్: కేటీఆర్ హైడ్రోజన్ బాంబు వేస్తే దాని వల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో, దేశం ఎంత అల్లకల్లోలమవుతుందోనని ఆందోళన చెందామని, చివరకు ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేకపోయారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎవరో ఒక ఎంపీ ఈ భూముల వ్యవహారం వెనుక ఉన్నాడని చెప్పిన కేటీఆర్, ఆ ఎంపీ పేరు మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.
కంచ గచ్చిబౌలి భూముల కుంభకోణాన్ని 48 గంటల్లో బయటపెడతానని సవాల్ చేసిన కేటీఆర్, ఇప్పటి వరకు చేసిందేమీ లేదని అన్నారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారం వెనుక రూ. 10 వేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బిల్లీరావుతో కలిసి ఈ భూములను కేటీఆర్ కాజేయాలనుకున్నారని ఆరోపించారు.