– పథకం ప్రకారం ఏ1 జనార్థన్ రావుతో వీడియో రిలీజ్ చేయించారు
– జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్ రావు వీడియో ఎలా రిలీజ్ చేశాడు?
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు
తాడేపల్లి: ఇప్పటికే ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నేతలు నకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ బురదను వైయస్ఆర్సీపీకి అంటించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్థన్‌రావుతో ఒక వీడియోను తీయించి, దానిలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పిండంతో ఈ కుట్ర బయటపడిందని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావు ఎలా వీడియో తీయగలడని, దానిని మీడియాకు ఎలా చేర్చగలిగాడని వారు ప్రశ్నించారు. ఇంకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్‌రావు వీడియో ఒకటి ఈ సాయంత్రం లీక్ చేశారు. నిజానికి ఆయన ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది? ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు జనార్థన్ రావు, జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు.. స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారు.
ఈ వీడియో గురించి పూర్తి వాస్తవాలు బయటపెట్టాలి. సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఎల్లో మీడియా ఈ వీడియోను ఎలా విడుదల చేసిందో చెప్పాలని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు.