– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం : ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
పుష్కర ఘాట్ వద్ద పొదుపు సంఘాల మహిళలతో స్వదేశీ వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని చెప్పారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు ఇలా వేర్వేరు రంగాల్లో పన్నులు తగ్గాయని, తద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదా అవుతుందన్నారు.