– తైతక్కల రోజా..నీ నాలుక మీద వాత పెడతాం
– కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతల విమర్శలు
– మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నెల్లూరు నగర టిడిపి మహిళ అధ్యక్షురాలు కప్పిర రేవతి
నెల్లూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ, అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టిడిపి మహిళ అధ్యక్షురాలు కప్పిర రేవతి ధ్వజమెత్తారు.
నెల్లూరు టిడిపి కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలకడ లేకపోవడం వల్లే రోజాను ‘తైతక్కల రోజా’ అని పిలవాల్సి వస్తోందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొలకలచెరువులో ఇటీవల వెలుగుచూసిన కల్తీ మద్యం వ్యవహారానికి గత వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
“పీనుగ పోయినా… ఆ పీనుగ చేసిన పాపం ఇంకా అక్కడ అక్కడ కన్పిస్తూనే ఉంది తైతక్కల రోజా అంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. మీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటే వ్యాఖ్యానించారు. మీ పాపాల్ని తుడిచే ప్రయత్నంలోనే మొలకల చెరువులో కల్తీ సారా వ్యవహరం వెలుగులోకి వచ్చిందనే విషయం తెలుసుకోవాలన్నారు.. టిడిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని మండి పడ్డారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ కల్తీ సారా పాపం పురుడు పోసుకుందన్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయట పెట్టిందన్నారు. మొలకల చెరువు కల్తీ సారా అంశాన్ని బయట పెట్టింది కూటమి ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారులు, మేము ప్రక్షాళన చేస్తుంటే… ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెడతున్నారంటూ ధ్వజమెత్తారు.
గొడ్డలి పోటు నుంచి గులక రాయి వరకు మీ డ్రామాలు చూశామన్నారు. తప్పు మీరు చేయడం.. నెపాన్ని మా మీద నెట్టడం మీకు అలవాటేగా? వైసీపీ ప్రభుత్వంలో నువ్వు ఎన్ని చేసావో ప్రజలందరికీ తెలుసు అన్నారు. టిడిపి జోలికి వస్తే మీ అంతు చూస్తామని, టిడిపి ప్రభుత్వం గాని, మమ్మల్ని గాని గోహేట్ అంటే నీ నాలుక మీద వాత పెడతాం అన్నారు.
మీ వైసీపీ ప్రభుత్వంపై రాజశేఖర్ రెడ్డి ఆత్మఘోషిస్తుందని తెలిపారు. సిగ్గు లేకుండా ఆరోపణ చేయడం సరికాదు అన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని, మరోసారి ముఖ్యమంత్రిని ఎవరైనా మాట్లాడితే నీ నాలుక కోస్తామని కప్పిర రేవతి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ,శ్రీలక్ష్మి,మంజుల,తులసి,అనుష,లత,సునీత,ప్రవీణ తదితరులు పాల్గొన్నారు