– సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత
విజయవాడ: మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీకని సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం అమల్లో ఉండి నేటికి 75 సంవత్సారాల అయ్యిందన్నారు. ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణ లత సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగులతో ఆఫీస్ కాన్పరెన్స్ హాల్లో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్బంగా అదనపు సంచాలకులు మాట్లాడుతూ సర్వమానవ సమానత్వాన్ని సహేతుకంగా నిరూపించిన సమతావాది అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలకు మన రాజ్యాంగం దిక్సూచి గా నిలుస్తుందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల పునాదులపై రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఈ చారిత్రాత్మక ఘటనలో ఉద్యోగులుగా మనం ఇందులో భాగస్వామ్యం కావడం మనందరికీ గర్వకారణమన్నారు.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగానికి రూపకల్పన జరిగిందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగందే కీలక పాత్ర అని అన్నారు. ప్రాముఖ్యత గల రాజ్యాంగ దినోత్సవాన్ని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ బి. పూర్ణ చంద్రరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం. భాస్కర నారాయణ, వెంకట్రాజ్ గౌడ్, జీవీ ప్రసాద్, ఎకౌంట్స్ ఆఫీసర్ జీ. రమణయ్య, అధికారులు, ఆఫీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.