కుర్రాడిగా ఉన్నప్పుడు కసితో పట్టుదలతో శివ సినిమా తీసి తెలుగు సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ సృష్టించావ్
అక్కినేని వారసుడికి స్టార్ డమ్ ఇచ్చావ్
అదే ఊపు తో.. అదే ఉత్సాహంతో మరో నాలుగైదు బ్లాక్ బస్టర్స్ తీసి అందరి దృష్టి నీ మీద పడేలా చేసుకున్నావ్
ఆ దెబ్బకి ముంబై లో కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగి ఏకంగా అమితాబ్ ని డైరెక్ట్ చేసే స్థాయికి పెరిగావు
ఒంట్లో పులుసు అయిపోయినప్పుడే తప్పుకోమని శోభన్ బాబు చెప్పిన మాట వినుంటే ట్రెండ్ సెట్టర్ వర్మ గా నీ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది
ఇలా కనిపించిన వారి జీవిత చరిత్రలు తియ్యాల్సిన పని ఉండేది కాదు
ముంబై నుంచి దిగుమతి చేసుకున్న హీరోయిన్ల తొడలు..పాదాలు చూపించి సినిమాలు తీసుకునే దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చేది కాదు
చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకోవడం వేరు
సంపాదించుకున్న మంచి పేరును నిలుపుకోవడం వేరు
నీ ముందు ఎంతో మంది దర్శకులు చక్కటి సినిమాలు తీసి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఈ రోజుకీ ఆ మంచి పేరుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారు
సరే సినిమా నీ పాషన్ కాబట్టి నీకు ఇష్టమైన సినిమాలు నువ్వు తీసుకుంటావ్
ఇష్టమైన వాడు టికెట్ కొనుక్కుని చూస్తాడు
ఇష్టం లేనివాడు మానేస్తాడు అంటావ్ అంతేగా
ఓకే అదలా ఉంచితే ఐడెంటిటీ క్రైసిస్ కోసం నువ్ చేసే పనులు నీ విలువను పెంచకపోగా మరింత తగ్గిస్తున్నాయని గుర్తించలేకపోతున్నావ్
చేతిలొ ట్విట్టర్ ఉంది కదా అని ఎవరిమీద పడితే వాళ్ళ మీద సెటైర్లు వేస్తే.. ట్రోలింగ్ చేస్తే కాలం ఒక్కలా ఉంటుందేంటి?
సమయం వచ్చినప్పుడు బదులు తీర్చుకుంటుంది
వాళ్ల డిప్యూటీ సీఎంని అంటే వాళ్ళ పోలీసులు ఊరుకుంటారెంటీ?
ఇదిగో ఇలాగే వేటాడుతారు
ఆఖరికి వాళ్ళని తప్పించుకోవడం కోసం ఎక్కడెక్కడో తల దాచుకోవాల్సిన ఖర్మ ఏంటి బాసూ !
ఒక్కటి గుర్తు పెట్టుకో
మన ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది సినిమా కాదు
జీవితం
– పరేష్ తుర్లపాటి