• పేద, మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ సంస్కరణలతో లబ్ధి
– 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు.
బీసెంట్ రోడ్డులో గల చార్టర్డ్ అకౌంటెంట్ భవన్ కార్యాలయంలో చార్టెర్డ్ అకౌంటెంట్స్ తో ఏర్పాటు చేసి వర్క్ షాపులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని, మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆర్థిక భారమైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా శీతారామన్ లక్ష్యమన్నారు. జీఎస్టీ సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సముచిత వేదికగా భావిస్తున్నానన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి సేవలందించే ఆడిటర్ల సమక్షంలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సెమినార్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడటం సమాజం పట్ల నా బాధ్యతను మరింతగా గుర్తు చేసిందన్నారు.
నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ కింద 56 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ రేట్లను 4 కేటగిరీలైన 5%, 12%, 18%, 28% ల నుండి 2 కేటగిరీలకు 5%, 18% పునర్వ్యవస్థీకరించారన్నారు. తగ్గిన ధరల మేలు వినియోగదారులకు చేరేలా, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. దేశంలోనే జీఎస్టీ సంస్కరణలకు అనుకూలంగా తీర్మానం చేసిన తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత 90% కుటుంబాల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. నిత్యావసర వస్తువులు, సేవలపై ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. జీవన & ఆరోగ్య బీమా ఖర్చులు తగ్గుతాయని, ఆహార పదార్థాలు, ప్రాణరక్షక మందులు, వైద్య పరికరాలు 0%, 5% కి తగ్గించబడ్డాయన్నారు. పాఠశాల పుస్తకాలు మరియు విద్యాసంబంధిత అవసరాలు 0% లేదా 5%కు తగ్గించబడ్డాయి, వ్యవసాయానికి ట్రాక్టర్లు, నిర్మాణానికి సిమెంట్ 28% నుండి 18% కు తగ్గించబడ్డాయని తెలిపారు. 1500 CC లోపు వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయన్నారు.
సామాన్యులకు ప్రయోజనం చేకూర్చి, వాణిజ్యాన్ని సులభతరం చేయడం, అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులోకి తేవడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశ్యం గా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ ₹ 2 లక్షల కోట్ల నుంచి ₹ 6 లక్షల కోట్లకు పెరిగిందని, 60 ఏళ్లలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, 11 ఏళ్లలోనే 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు.. 24 గంటల విద్యుత్ సరఫరా, 16,000 గ్రామాలకు విద్యుదీకరణ, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, 3.5 కోట్ల ఇళ్లకు పీఎంఏవై సబ్సిడీ అందించటం జరిగిందని వివరించారు. రోజుకు 29 కి.మీ. జాతీయ రహదారి నిర్మాణం, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం (₹4.5 లక్షల కోట్లు), ఉచితంగా 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగాయని పేర్కొన్నారు.
45,000 కి.మీ. రైల్వే విద్యుదీకరణ, 1,275 అమృత్ భారత్ స్టేషన్లు (ఏపీలో 73), రైతులకు పీఎం-కిసాన్, యూరియా సబ్సిడీలు, ఇవన్నీ కేంద్రం అందిస్తోందని తెలిపారు. గత 11 ఏళ్లలో 55 కోట్ల జన్ ధన్ ఖాతాల ద్వారా ₹45 లక్షల కోట్ల నగదు పాదర్శకంగా జరిగాయన్నారు. జీఎస్టీ వచ్చినప్పుడు ప్రజలకు తగ్గింపు మేలు అందించాలని బహుళజాతి కంపెనీలను హెచ్చరించినట్లు, ఇప్పుడు కూడా జీఎస్టీ సంస్కరణల మేలు వినియోగదారులకు తప్పనిసరిగా చేరాలని చైర్మన్ లంకా దినకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ బ్రాంచ్ ICAI (The Institute of Chartered Accountants of India (ICAI) చైర్మన్ సీఏ కె. నారాయణ, సెక్రటరీ సీఏ మనీష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు