– హైకోర్టు తీర్పు
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రవీణ్ కమార్ ప్రస్తుతం ఏపీఐఐసీ ఎండీగా ఉన్నారు.
గతంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. భీములపట్నం మండలంలోని కాపులప్పాడ గ్రామం పరిధిలో ఏడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి.. నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రవీణ్ కుమార్‌కు రెండు వారాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే తీర్పు అమలును నాలుగు వారాలకు వాయిదా వేసింది..