Suryaa.co.in

Features

రైతు మెడపై పత్తి కత్తి

నష్టాల బాటలో పత్తి రైతు
తీవ్ర వర్షాభావంతో రేగడినేలల్లో విత్తనం జాడలేదు
తెలంగాణాలో లాగా పెట్టుబడి సాయం అందించడం లేదు
మార్కెట్లో దొరుకుతున్న నకిలీ విత్తనాలపై దృష్టి సారించడం లేదు

అక్టోబర్ నెల వచ్చి రెండు వారాలు అవుతుంది, ఇంతవరకు గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, గుంతకల్లు మండలాల్లో ఒక్క ఎకరంలో పత్తి విత్తిన పాపాన పోలేదు . రుతుపవనాల కారణంగా రాయలసీమ ప్రాంతం కరువు పరిస్థితులు ఎదుర్కొంటోంది. లోటు వర్షపాతం కారణంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం ఇప్పటికే 14 శాతం కిందికి పడిపోయింది . భూగర్భజల శాఖ ప్రకారం 42% వర్షపాతం విచలనం ఉంది.

గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు మండలంలో జూన్ నెల సాధారణ వర్షపాతం 110 మి.మీ కాగా, మండలం లో ఇప్పటి వరకు 53.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. గుత్తి, కరిడికొండ, వన్నెదొడ్డి, పోదొడ్డి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా లేకపోవడం వలన ఇప్పటికే తాగునీటి కష్టాలు అంతా ఇంతా కాదు. ఇళ్లల్లో ఉక్కపోత వాతావరణం వేసవిని తలపిస్తున్నది. నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందని భూగర్భ జల శాఖ అధికారులు చెబుతున్నారు.

గత ఏడాది వరకు వర్షం పర్వాలేదు, మంచి నీటి ఎద్దడి ఏర్పడలేదు, అయితే ఈ ఏడాది కూడా వర్షాలు కురవకపోతే ఈ ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని గౌతమ్ బుద్ధ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు డా ముచ్చుకోట సురేష్ బాబు , బాయినేని నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా, 2002 నుంచి ఈ ప్రాంతం అపూర్వమైన ఫ్రీక్వెన్సీని చవిచూసింది కరువులు. జిల్లాలో దాదాపు వంద మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు. ఎనభై శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు, వ్యవసాయంపై ఎటువంటి ఆశ లేదు.

ఏడాది పత్తి రైతుల బాధ ఎంత చెప్పుకున్న తక్కువే..పంట పండించిన రైతులలో ఏ రైతు అయినా బాధ పడుతున్నాడంటే అది కేవలం పత్తి రైతు మాత్రమే. పత్తి అమ్మడంలో దళారుల చేతిలో మోసపోతున్న పట్టించుకునే వారే లేరు. దళారులు చెపింది రేటు ఇచ్చిందే మద్దతు ధర అన్న చందనం గ మారింది రైతుల పరిస్థితి. గత కొన్ని రోజులగా పత్తికి మద్దతు ధర రైతులు పత్తి పంటను ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు.

దిగుబడి, ధరలతో విలవిల
గతేడాది క్వింటా ధర రూ.10 వేలు ప్రస్తుతం రూ.6 వేలకే పరిమితం. అధికంగా దళారుల బెడద ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లకు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా పత్తి ధరలు పడుతూ.. లేస్తూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పత్తిని అమ్మేందుకు ఊగిసలాడుతున్నారు. గత ఏడాదితో పోల్చికుంటే ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.ఆరు వేలు పలుకుతోంది.

ఖరీఫ్‌లో సాగైన పత్తి పంట వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట సాగు సమయంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ తరువాత వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గుముఖం పట్టింది. దిగుబడితో పాటు ధరలు అమాంతం తగ్గాయి. ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తోంది. గత ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర ఉండటంతో ఎక్కువ మంది రైతులు పంట సాగు చేపట్టారు.

కిలో పత్తి ధర ప్రారంభంలో రూ.85 నుంచి రూ.90ల వరకు పలికింది. ప్రస్తుతం రూ.60కు తగ్గింది. గత ఏడాది క్రితం సిసిఐ రూ.95కి కొనుగోలు చేసింది. ఈ ఏడాది దిగుబడి చేతికి అంది వచ్చిన తర్వత అనంతరం రూ.60 నుంచి రూ.65కు చేరింది. గతంలో దిగుబడి ఆశాజనకంగా లేని సమయంలో క్వింటా రూ.105 వరకు పలికింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు కూడా పత్తి రైతులు నోచుకోవడంలేదు.

రైతులకు వేర్వేరు కారణాలు చూపి దళారీలు మభ్యపెట్టేవారు. నాణ్యత, రంగు లేదని సాకులు చూపుతూ తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. దళారీలు పత్తి రైతుల వద్ద తక్కువ ధరలకు సేకరించి పత్తిని ఆదోని, బళ్లారి, ప్రొద్దుటూరు, గుంటూరు, నంద్యాల, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ మిల్లులలో అమ్ముకుంటూ అధిక ధరలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాలలో తూకాలు వేసే సందర్భంలో కూడా చాలావరకు మోసాలకు పాల్పడుతున్నప్పటికీ కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ధరలు తగ్గడంతో పత్తి కోసం వ్యాపారులు గ్రామాల బాట పట్టిన రైతులు అమ్మకాలకు విముఖత చూపుతున్నారు.

తెగుళ్లతో తగ్గిన దిగుబడి. పొలాలను కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేపట్టాను. పంట సాగు చేసినప్పట్టి నుంచి తెగుళ్ల బెడద అధికంగా ఉంది. అధికంగా పురుగు మందులు వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం పంట చేతికి వచ్చిన తరువాత ధరలు అమాంతం తగ్గాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి.

తెలంగాణాలో లాగా పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించడం లేదు. మార్కెట్లో దొరుకుతున్న నకిలీ విత్తనాలపై దృష్టి సారించడం లేదు. ఇక పురుగు మందుల విషయంలోనూ అంతంతమాత్రంగానే పట్టించుకుంటుంది. వీటితోపాటు వాతావరణ పరిస్థితులు రైతుకి అనుకూలించాలి. లేకుంటే రైతుకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. తీరా సాగు చేసిన పంట అమ్ముకుందామని మార్కెట్ కి వెళ్తే అక్కడ గిట్టుబాటు ధర రాక రైతన్నలు కుదేలవుతున్నారు. ఇన్ని సమస్యలు రైతాంగాన్ని పట్టిపీడిస్తున్నాయని డా యం. సురేష్ బాబు తెలిపారు. ఈ సంవత్సరం పంటలు లేక ఇప్పటికే పశుగ్రాసం కరువై పశువులను కబేళాకు తరలిస్తున్నారు.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక
9989988912

LEAVE A RESPONSE