The Union Minister of Coal and Mines, Shri G. Kishan Reddy attends the release meeting of the guidelines for the rejuvenation of traditional water bodies in coal and lignite mining regions held at Shastri Bhawan, in New Delhi on August 01, 2024.
– దూది పింజ లాంగ్ స్టేపుల్ ఉండే విధంగా మెరుగైన పత్తి సాగు చేయాలి
– రూ.58 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో, రూ.8 వేల కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్ల మీద ఖర్చు చేశారు.
– కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు ఒకే రకమైన నిబంధనలు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సాగు అంచనా నివేదికలు సమీక్షించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మార్కెటింగ్ శాఖ, అగ్రికల్చర్ శాఖ, సిసిఐ, రెవెన్యూ విభాగం.. అన్నీ కలిసి పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నారు.
హై డెన్సిటీ పత్తి సాగు విధానం మహారాష్ట్రలో విజయవంతమైంది, ఆ మోడల్‌ను తెలంగాణలోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 24 లక్షల మంది రైతులు పత్తి సాగులో పాల్గొంటున్నారు, దేశవ్యాప్తంగా పత్తి దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది
కేంద్ర ప్రభుత్వం పత్తి రంగాన్ని పటిష్ఠం చేయడం కోసం రూ.600 కోట్లతో “కపాస్ క్రాంతి మిషన్” అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దూది పింజ లాంగ్ స్టేపుల్ ఉండే విధంగా మెరుగైన పత్తి సాగు చేయాలి. అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్ర–సాంకేతిక పరిశోధన, విస్తరణ పద్ధతులు తీసుకురావాలనే ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
మహారాష్ట్రలో కొంతమంది రైతులు పత్తి దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆ విధానాలను మన రాష్ట్రంలో కూడా అనువైన ప్రాంతాల్లో అమలు చేసి, దిగుబడి పెంచే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మహారాష్ట్రలోని అకోలా ప్రాంతంలోని రైతులు హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారు. దాని వల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే అకోలా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ పద్ధతి అమలులో ఉంది. మహారాష్ట్ర రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అధిక సాంద్రత విత్తన పద్ధతిని అనుసరిస్తున్నారు. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ విత్తనాలు నాటుతున్నారు. మన రాష్ట్రంలో కూడా వచ్చే సంవత్సరం నుంచి రైతులను ప్రోత్సహించాలనే దృక్పథంతో గతంలో కొంత ప్రయత్నం చేసినా, అది పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు.
అందువల్ల రైతులను స్వయంగా మహారాష్ట్రకు తీసుకెళ్లి చూపించడం, అవసరమైన విత్తనాలు సమకూర్చడం, రైతులను మోటివేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖలో చర్చించినప్పుడు వారు సూచించారు.
పత్తి కొనుగోలు విలువలను పరిశీలిస్తే.. 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.24,825 కోట్ల విలువైన 173 లక్షల బేల్స్‌ను సిసిఐ ద్వారా కొనుగోలు చేసింది. కానీ 2014 నుండి గత 10 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని పెంచి రూ.1.37 లక్షల కోట్లను ఖర్చు చేసి 473 లక్షల బేల్స్ కొనుగోలు చేసింది.
అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పత్తి కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఖర్చు చేసింది. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో, తెలంగాణ–ఆంధ్ర కలిపి రూ.65 వేల కోట్ల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో రూ.58 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో, రూ.8 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్ల మీద ఖర్చు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 122 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అభివృద్ధి చేయబడ్డాయి. ఈ సెంటర్లు దీపావళి తర్వాత ప్రారంభం అవుతాయి. అలాగే రైతులకు సౌకర్యంగా ఉండే యాప్ కూడా దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుంది.రైతులు దీపావళి నుంచి యాప్‌లో తమ తమ పంటను రెడీగా ఉంచి, అమ్ముకోవాలనుకుంటే, ఆ యాప్‌లో డేట్ బుకింగ్ చేసుకుని తగిన సమయానికి విక్రయించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిఫా ఫార్మ్స్ పద్ధతిలో సహకరించి, పత్తి అమ్మకాలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో పత్తి దిగుబడి పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది.
ఈరోజు ఉదయం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కి సంబంధించిన ప్రధాన మూడు సెంటర్లు — అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ లో ఉన్న అధికారులతో పాటు తెలంగాణకు చెందిన వ్యవసాయ అధికారులు, సహకార విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, సిసిఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు.
ఈరోజు యాప్ గురించి రైతులు తెలుసుకోవడానికి కరపత్రాలు ముద్రించి, సోషల్ మీడియా — వాట్సాప్ గ్రూపులు, వీడియోల ద్వారా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారుల ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నారు. అదేవిధంగా వివిధ పత్రికల్లో యాడ్స్ ప్రచురిస్తున్నారు. కరపత్రాల్లో పత్తి తేమ శాతం ఎంత ఉండాలి, ఆ తేమ శాతానికి అనుగుణంగా ధర ఎంత ఉంటుంది అన్న వివరాలు కూడా ఇచ్చారు.
రైతులు ఎక్కడా మధ్యదలారీలకు అవకాశం ఇవ్వకుండా, తమ పంటను నేరుగా సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తుల చేత మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సమాచారాన్ని తెలుగు సహా తొమ్మిది భాషల్లో వీడియోల రూపంలో తయారు చేసి, రైతులను చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టారు.
ఈ దిశలో రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగాలని, వారికి లాభం కలగాలని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు గ్రామాల్లో యాప్ నమోదు విషయంలో కొంతమంది రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. దానికి సంబంధించి, వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి రైతులను కలుసుకుని, కరపత్రాలు అందజేస్తూ, ఎవరికైతే యాప్‌లో నమోదు చేయడంలో ఇబ్బంది ఉందో, వారికి సాయం చేస్తున్నారు.
ఇప్పుడున్న గ్రామీణ యువత చాలా అవగాహనతో ఉన్నారు . హైదరాబాద్‌లో ఉన్నవారికంటే ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, కాబట్టి వారు ఇతర రైతులకు సహాయం చేస్తున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ప్రతి గ్రామానికి వెళ్లి రైతులను మోటివేట్ చేసే కార్యక్రమాన్ని ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు.
గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పత్తి కనీస మద్దతు ధర (MSP) 100% పెంచడం జరిగింది. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ, అలాగే ప్రతి కొనుగోలు కేంద్రంలో అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, రైతుల ప్రతినిధులు ఉన్న కమిటీలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా రైతులు మోసపోతున్నారన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఆ కమిటీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చు.
జిన్నింగ్ మిల్స్, మధ్యవర్తులు లేదా దళారీల తప్పిదాలపై కఠిన చర్యలు తప్పవు.. మహారాష్ట్రలో ఉన్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను (హై డెన్సిటీ ప్లాంటేషన్ వంటి వాటిని) మన రాష్ట్ర రైతులు కూడా చూడేందుకు రైతులను మహారాష్ట్ర అకోలా ప్రాంతానికి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఇప్పుడున్న పంట సీజన్ ముగిసిన తర్వాత, మార్చ్ నెల తర్వాత ఈ కార్యక్రమాన్ని సిసిఐ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేస్తాం.