Suryaa.co.in

Telangana

కవిత కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు

లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం ఈడీ అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. దాంతో కోర్టు జ్యుడీషి యల్‌ కస్టడీని మరోసారి ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికే సీబీఐ కేసులో ఆమెకు కోర్టు ఈ నెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై 20న విచారిస్తామని జడ్జి తెలిపారు.

LEAVE A RESPONSE